Chiranjeevi: 7వ తరగతిలోనే… అంటూ చిలిపి పనులు బయటపెట్టిన మెగాస్టార్

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కు రెడీగా ఉండటంతో, ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ శరవేగంగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే లాల్ సింగ్ చద్దా యూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూని అక్కినేని నాగార్జున హోస్ట్ చేయడం విశేషం.

Chiranjeevi: 7వ తరగతిలోనే… అంటూ చిలిపి పనులు బయటపెట్టిన మెగాస్టార్

Chiranjeevi Opens About His First Love

Chiranjeevi: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా, ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తుండటంతో ఇక్కడ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

Laal Singh Chaddha : ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్న అమీర్ ఖాన్, చిరంజీవి..

ఇక ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసే క్రమంలో లాల్ సింగ్ చద్దా చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్, నాగచైతన్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే… ఈ ఇంటర్వ్యూని హోస్ట్ చేసింది అక్కినేని నాగార్జున. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేయగా ఇందులో అమీర్ ఖాన్, చిరు, చైతూలని నాగ్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్లు కనిపించింది. కాగా, చిరంజీవి తొలి ప్రేమ గురించి నాగ్ ఓ కొంటె ప్రశ్న కూడా వేశాడు.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

దీనికి సమాధానంగా చిరు తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యారు. తాను మొగల్తూరులో 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి సైకిల్‌పై స్కూలుకు వెళ్లేదని.. ఆమెను చూసి తాను కూడా ఆ అమ్మాయి సైకిల్ తొక్కేవాడినంటూ తన స్వీట్ మెమోరీస్ గుర్తుకు చేసుకున్నాడు చిరు. ఇలా ఇప్పటివరకు చిరు తన ఫస్ట్ లవ్ గురించి తాజాగా వెల్లడించడంతో, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే చిరు ఫస్ట్ లవ్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.