Chiranjeevi : కూతురికి చిరంజీవి ఖరీదైన బహుమతి..

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని 'వాల్తేరు వీరయ్య'తో గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. కాగా చిరు రీ ఎంట్రీ తరువాత నుంచి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కూతురు సుష్మిత వ్యవహరిస్తూ వస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో ముఖ్యంగా చిరు లుక్స్ వింటేజ్ ని మెగాస్టార్ ని గుర్తుకు చేశాయి. దీంతో..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. ‘వాల్తేరు వీరయ్య’గా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్టుని ఖాతాలో వేసుకున్నాడు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. ఇక ఈ మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ కామెడీతో అదరగొట్టేశాడు. దీంతో థియేటర్ లో వింటేజ్ చిరుని చూసేందుకు ప్రేక్షకులు ఎగపడ్డారు. దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Sai Pallavi : ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలి అనుకుంటుందో తెలుసా?

ఇక ఈ సినిమా సక్సెస్ తో చిరు చాలా హ్యాపీగా ఉన్నాడు. కాగా చిరు రీ ఎంట్రీ తరువాత నుంచి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కూతురు సుష్మిత వ్యవహరిస్తూ వస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో ముఖ్యంగా చిరు లుక్స్ వింటేజ్ ని మెగాస్టార్ ని గుర్తుకు చేశాయి. దీంతో ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తన కూతురు సుష్మితకు ఖరీదైన బహుమతిని అందజేశాడు. గోల్డ్, సిల్వర్ పూతపూసిన దుర్గామాతని చిరు బహుమతిగా ఇచ్చాడంటూ సుష్మిత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఫోటోని షేర్ చేసింది.

కాగా చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు