Neha Shetty : షూటింగ్ సమయంలో ఎండలకు కొంతమందికి వడదెబ్బ తగిలింది..

నేహాశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Neha Shetty : విశ్వక్‌ సేన్(Vishwak Sen), నేహాశెట్టి (Neha Shetty) జంటగా అంజలి (Anjali) ముఖ్య పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’( Gangs Of Godavari). పలు మార్లు వాయిదా పడ్డ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నేహాశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

నేహాశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాలో బుజ్జి అనే పాత్రలో కనిపిస్తాను. 90లలో జరిగిన కథ. ఓ బాగా డబ్బున్న ఇంట్లో పుట్టిన అమ్మాయి పాత్ర. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ పాత్రలో. ఈ పాత్ర కోసం డైరెక్టర్ గారు శోభన గారి సినిమాలు చూపించారు. చీరకట్టు, జుట్టు, కాటుక.. ఇలా అన్నిటి మీద ఫోకస్ చేశాను. కళ్ళతోనే హావభావాలు చూపించాను. ఈ పాత్ర కోసం కొంచెం కష్టపడ్డాను. నాకు తెలుగు వచ్చినా గోదావరి యాస కష్టంగా ఉండటంతో డబ్బింగ్ నేను చెప్పలేదు అని తెలిపింది.

అలాగే.. విశ్వక్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంజలికి నాకు కాంబినేషన్ ఎక్కువ సీన్స్ లేవు. ఆమె రియల్ లైఫ్ లో చాలా సరదాగా ఉంటారు. నేను సెట్ లో సైలెంట్ గా కూర్చుంటే ఆమె మాత్రం అందర్నీ పలకరిస్తూ నవ్వుతూ ఉంటుంది. టేక్ కి వెళ్ళగానే సీన్ కి తగ్గట్టు మారిపోతారు. నా కంటే సీనియర్ కాబట్టి నటనలో తన దగ్గర నుంచి మెళకువలు నేర్చుకున్నాను అని తెలిపింది.

Also Read : SSMB 29 : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమాన్..?

ఇక సినిమా షూటింగ్ గురించి చెప్తూ.. సమ్మర్ నుంచి సమ్మర్ వరకు ఒక ఏడాది పాటు షూట్ చేసాం. ఎండ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. ఓ సారి రాజమండ్రిలో షూట్ చేస్తున్నప్పుడు నేను లేను కానీ కొంతమందికి ఎండల వల్ల వడదెబ్బ కూడా తగిలింది. షూటింగ్ లో మంచి మెమొరీస్ కూడా ఉన్నాయి. అక్కడి ప్రజలు మంచి మంచి ఫుడ్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. మమ్మల్ని బాగా చూసుకున్నారు అని తెలిపింది.

ఇప్పటికి అందరూ డీజే టిల్లు రాధికా అని పిలవడంపై స్పందిస్తూ.. మన పాత్ర పేరుతో పిలిస్తే మంచిదే. షారుఖ్ ని బాద్‌షా అన్నట్టు నన్ను రాధికా అంటున్నారు. ఆ పాత్ర అందరికి బాగా కనెక్ట్ అయింది. అందుకే వాళ్ళు అభిమానంతో అలా పిలుస్తారు అని తెలిపింది. ఇక సితారలో వరుసగా సినిమాలు చేస్తున్నాను, ఇందులో ఇంకా సినిమా ఛాన్సులు రావాలి. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు