SSMB 29 : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమాన్..?

ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పలువురు నటిస్తున్నట్టు రూమర్లు వచ్చాయి.

SSMB 29 : రాజమౌళి(Rajamouli) – మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. సినిమా ఉందని ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే సైలెంట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ దుబాయ్ లో వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం బాడీని, జుట్టుని పెంచుతున్నాడు. ఇటీవల జుట్టు బాగా పెంచి, గడ్డం పెంచి, మంచి బాడీ తో కనపడిన మహేష్ ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి.

ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు నటిస్తున్నట్టు రూమర్లు వచ్చాయి. తాజాగా SSMB29 సినిమాలో బాలీవుడ్ నటుడు దేవ్ దత్త నాగే నటిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో దేవ్ దత్త నాగే హనుమంతుడిగా నటించి మెప్పించాడు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు దేవ్ దత్త.

Also Read : Pawan Kalyan : మరోసారి OG కోసం పవన్ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్.. ఒక్క సీన్ మూడు రోజులు షూట్.. పవన్ ఫ్యాన్స్ కి పండగే..

ఇప్పుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దేవ్ దత్త రాజమౌళిని కలిసిన ఫోటో బయటకి రావడంతో ఈ వార్త నిజమనుకుంటున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి – మహేష్ సినిమాలో నటిస్తున్నట్టు వచ్చిన వార్తల్లాగే ఇది కూడా రూమర్ మాత్రమేనా లేక నిజమా అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు