Shah Rukh Khan : కేకేఆర్ విజయంతో ఎమోషనల్ అయిన షారుఖ్ ఫ్యామిలీ.. ఏడుస్తూ నాన్నని హత్తుకున్నా సుహానా ఖాన్..

తాజాగా నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ మూడోసారి గెలుచుకోవడంతో షారుక్ ఖాన్ తో పాటు ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయింది.

Shah Rukh Khan : చెన్నై వేదికగా నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో(SRH) తలపడిన కేకేఆర్ (KKR) ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో ఛేదించి కోల్‌కతా సునాయసంగా ఐపీఎల్ 2024‌ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఇటు హైదరాబాద్ అభిమానులు నిరాశ చెందగా అటు కోల్‌కతా అభిమనులు సంబరాలు చేసుకుంటున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ అని తెలిసిందే. కోల్‌కతాకి సంబంధించి ఏ మ్యాచ్ జరిగినా షారుఖ్ తన ఫ్యామిలీతో వచ్చి మరీ తన టీమ్ కు సపోర్ట్ చేస్తాడు. ఇక షారుఖ్ కి సపోర్ట్ గా, షారుఖ్ కూతురు సుహానా కోసం పలువురు బాలీవుడ్ నటీనటులు, ఫ్రెండ్స్ కూడా కోల్‌కతా మ్యాచ్ లకు వస్తారు. కోల్‌కతా గెలిస్తే సుహానా స్టేడియంలోనే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. పలుమార్లు సుహానా ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Prabhas – Pawan Kalyan : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ సుజీత్ కామెంట్స్.. ఊహిస్తేనే ఓ రేంజ్‌లో ఉందిగా..

తాజాగా నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ మూడోసారి గెలుచుకోవడంతో షారుక్ ఖాన్ తో పాటు ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయింది. ఇక షారుఖ్ కూతురు సుహానా అయితే ఏడుస్తూ తండ్రిని హత్తుకుంది. షారుఖ్ కొడుకులు ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్ కూడా షారుఖ్ ని కౌగలించుకున్నారు. ఇక షారుఖ్ ఎమోషనల్ అవుతూ తన భార్య గౌరీఖాన్ ని కౌగలించుకొని ముద్దు పెట్టాడు. దీంతో ఎమోషనల్ అవుతున్న షారుఖ్ ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసి షారుఖ్ అభిమానులు కూడా ఎమోషనల్ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు