Pawan Kalyan : మరోసారి OG కోసం పవన్ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్.. ఒక్క సీన్ మూడు రోజులు షూట్.. పవన్ ఫ్యాన్స్ కి పండగే..

సుజీత్ OG సినిమాలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు.

Pawan Kalyan : ఏపీ ఎన్నికల కారణంగా పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ డేట్స్ కోసం ఆ మూడు సినిమా యూనిట్స్ ఎదురుచూస్తున్నాయి. అయితే వీటిలో OG సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని డేట్ కూడా చెప్పేసారు కాబట్టి OG సినిమానే ముందు వస్తుంది. ఇంకా 20 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే OG షూటింగ్ అయిపోతుంది. ఇప్పటికే OG సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొని OG సినిమా గురించి కూడా పలు విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో OG సినిమాలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు.

Also Read : Prabhas – Pawan Kalyan : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ సుజీత్ కామెంట్స్.. ఊహిస్తేనే ఓ రేంజ్‌లో ఉందిగా..

సుజీత్ మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐకిడో ఫైట్ OG సినిమాలో ఉంది. దాని గురించి చాలానే రీసెర్చ్ చేసాము. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎగ్జైట్ అయి తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేశారు. అలాగే ఐకిడో కి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా చూసారు. దాని గురించి నాతో మరింత చర్చించి సీన్ ని చాలా బాగా వచ్చేలా కష్టపడ్డారు. హాఫ్ డేలో అయిపోవాల్సిన ఆ సీన్ ని పవన్ గారు ఇంకా పర్ఫెక్ట్ గా తేవాలని మూడు రోజులు షూట్ అయింది. కళ్యాణ్ గారికి ఏదైనా ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అంత తొందరగా వదలరు అని తెలిపాడు.

Also Read : Pawan Kalyan OG : పవన్ OG అసలు పేరు ఇదా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంట.. క్లారిటీ ఇచ్చిన సుజీత్..

దీంతో పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ లో ఐకిడో చేస్తున్నాడని తెలిసి అభిమానులు సంతోషిస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలో తన ఐకిడో ట్యాలెంట్ ని చూపించాడు. ఆ సమయంలోనే జపాన్ వెళ్లి ఐకిడో నేర్చుకున్నాడు పవన్. అయితే ఆ సినిమాలో ఐకిడోతో ఎలాంటి ఫైట్స్ ఉండవు. కానీ ఇప్పుడు OG సినిమాలో ఐకిడోతో పవన్ ఫైట్స్ చేయబోతున్నాడని తెలిసి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల పవన్ ఐకిడో డ్రెస్ లో ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫొటోస్ OG సెట్స్ నుంచి లీక్ అయిన సంగతి తెల్సిందే. సుజీత్ ఒకే ఇంటర్వ్యూలో OG సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు