Prabhas – Pawan Kalyan : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ సుజీత్ కామెంట్స్.. ఊహిస్తేనే ఓ రేంజ్‌లో ఉందిగా..

తాజాగా సుజీత్ భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ప్రమోషన్స్ లో OG సినిమా గురించి కూడా మాట్లాడాడు.

Prabhas – Pawan Kalyan : డైరెక్టర్ సుజీత్ గతంలో ప్రభాస్ తో సాహో అనే స్టైలిష్ సినిమాను తీసి అభిమానులను మెప్పించాడు. కమర్షియల్ గా ఈ సినిమా జస్ట్ పాస్ అయింది కానీ స్టైలిష్, లుక్స్, టేకింగ్ పరంగా ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ సినిమాల్లో ఒకటి. అసలు యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. దీంతో సుజీత్ అందరికి నచ్చేసాడు. ప్రస్తుతం సుజీత్ పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ అభిమానులు అయితే సుజీత్ ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఆ గ్లింప్స్ చూసి. OG సినిమాలో పవన్ ని స్టైలిష్ గా, ఫుల్ మాస్ గా చూపించబోతున్నాడు సుజీత్. తాజాగా సుజీత్ భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ప్రమోషన్స్ లో OG సినిమా గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఓ ఆసక్తికర కామెంట్ చేసాడు.

Also Read : Pawan Kalyan OG : పవన్ OG అసలు పేరు ఇదా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంట.. క్లారిటీ ఇచ్చిన సుజీత్..

సుజీత్ మాట్లాడుతూ.. కుదిరితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని తెలిపాడు. ఇంకేముంది ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రభాస్ సాహో సినిమాకు, పవన్ OG సినిమాకు లింక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కథల పరంగా చూస్తే. దీంతో ప్రభాస్, పవన్ అభిమానులు ఆ రెండు సినిమాలను కలిపేసి ఓ సినిమాటిక్ యూనివర్స్ తీసుకొచ్చి అదిరిపోయే భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ చెయ్ ఫ్యాన్స్ అంతా నీకు రుణపడి ఉంటారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు