Chiranjeevi : 24 గంటల్లో చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్

 ఇటీవల మెగాస్టార్ చిరంజీవి శబరిమల, గురువాయూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ యాత్ర కి సంబంధించి స్పెషల్ వీడియోని మెగాస్టార్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 24 గంటల్లో ఒక........

Chiranjeevi : 24 గంటల్లో చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్

Megastar

 

Chiranjeevi :  ఇటీవల మెగాస్టార్ చిరంజీవి శబరిమల, గురువాయూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ యాత్ర కి సంబంధించి స్పెషల్ వీడియోని మెగాస్టార్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 24 గంటల్లో ఒక ఆధ్యాత్మిక యాత్రని పూర్తి చేసినట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 12 రాత్రి నుంచి 13 రాత్రి వరకు 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో మూడు ఆధ్యాత్మిక కేంద్రాలని సందర్శించారు.

మెగాస్టార్ చిరంజీవి శ్రీమ‌తి సురేఖ‌, ఫొనిక్స్ సురేష్ దంప‌తులు కలిసి ముందుగా ఫిబ్ర‌వ‌రి 12 రాత్రి తెలంగాణ ముచ్చింత‌ల్‌లోని శ్రీ రామానుజచార్యులు వారి స‌మ‌తా మూర్తి ఆలయాన్ని దర్శించి, ఆ తర్వాత కేరళకు పయనమయ్యారు. కేరళలో ఫిబ్రవరి 13 ఉదయం శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఫిబ్రవరి 13 సాయంత్రం గురువాయూర్‌కు వెళ్లి అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్నారు.

K Viswanath : మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. కళాతపస్వికి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు

ఇలా 24 గంటల్లో మూడు ఆధ్యాత్మిక కేంద్రాలని సందర్శించి దానికి సంబంధించిన వీడియోని, ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.