Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

సీనియర్ హీరోలలో టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ప్రస్తుతం మూడు సినిమాలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీగా ఉన్నాడు. నాగ్ నటించే సినిమాలలో బంగార్రాజు విడుదలకి..

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

Brahmāstra

Brahmāstra: సీనియర్ హీరోలలో టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ప్రస్తుతం మూడు సినిమాలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీగా ఉన్నాడు. నాగ్ నటించే సినిమాలలో బంగార్రాజు విడుదలకి సిద్దమవగా.. ది ఘోస్ట్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక బ్రహ్మాస్త్ర గురించి నిన్నటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రెండేళ్ల క్రితం కరోనాకు ముందు ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగి ఆగిపోయింది. కరోనా తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేకుండాపోయింది.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

బ్రహ్మాస్త్ర బాలీవుడ్ సినిమా. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కాల్సిన సినిమా. కరోనా తర్వాత ఎవరికి వారు బిజీగా మారడంతో ఈ సినిమా మళ్ళీ పట్టాలెక్కేందుకు ముహూర్తం సెట్ కాలేదు. అయితే.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా కూడా ముహూర్తం పెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టబోతున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

ఆ తర్వాత సమయాన్ని బట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ పూర్తిచేసి సరైన సమయంలో విడుదల చేయనున్నారట. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9వ ఈ తేదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా కూడా మరో తేదీ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ సినిమా విడుదల సమయానికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై అలియా భట్ పాత్రకి ఇక్కడ కూడా ఫుల్ క్రేజ్ దక్కడం ఖాయం కాగా.. ఇటు నాగ్ కూడా తోడై ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడం ఖాయంగా కనిపిస్తుంది.