Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

అఖండ సూపర్ డూపర్ హిట్ తర్వాత నందమూరి బాలయ్య ఇప్పుడు యంగ్ దర్శకులకు కూడా వాంటెడ్ హీరో అయిపోయాడు.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

Srikanth Addala

Srikanth Addala: అఖండ సూపర్ డూపర్ హిట్ తర్వాత నందమూరి బాలయ్య ఇప్పుడు యంగ్ దర్శకులకు కూడా వాంటెడ్ హీరో అయిపోయాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు వరసగా సినిమాలను పట్టాలెక్కించేందుకు లైనప్ సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఒక సినిమా పట్టాలెక్కించగా కొరటాల శివ కూడా ఎన్టీఆర్ సినిమా తర్వాత బాలయ్యతోనే సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లుగా వినిపిస్తుంది.

Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

ఇక, తాజాగా బాలకృష్ణకి ఓ క్లాస్ దర్శకుడు కథను వినిపించాడని టాక్ నడుస్తుంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల తాజాగా వెంకటేష్ నారప్ప రీమేక్ తో మాస్ టచ్ చేశాడు. అయితే.. ఈసారి బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నాడట. ఇప్పటికే బాలయ్యకి ఆ కథ కూడా వినిపించాడని తెలుస్తుంది.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

నిజానికి శ్రీకాంత్ వెనుక దిల్ రాజు ఉండే ఈ తతంగం నడిపించాడని.. ఈ సినిమాను దిల్ రాజే నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే.. ఇంతకీ బాలయ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. శ్రీకాంత్ లాంటి క్లాస్ దర్శకుడు ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నాడు.. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది నందమూరి అభిమానులకు ఆసక్తిగా మారింది.