DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

డీజే టిల్లు’ సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినా చివరికి ఈ సినిమాను కూడా వాయిదా వేశారు.

DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

Dj Tillu

DJ Tillu: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను మొదట సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేసుకోగా చివరికి ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. మళ్ళీ భీమ్లా నాయక్ పండగకి తీసుకొస్తారని ప్రచారం జరిగినా అది కుదరలేదు. అయితే భీమ్లా నాయక్ మేకర్స్ పవన్ సినిమాను తీసుకురాలేదు కానీ వారి బ్యానర్ నుండి మరో సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నామని ప్రకటించారు.

Hero Trailer: ‘హీరో’ తొలి సినిమా కష్టాలకు తోడైన ప్రేమ!

యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘డీజే టిల్లు’ సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినా చివరికి ఈ సినిమాను కూడా వాయిదా వేశారు. జనవరి 14న విడుదల చేయాలని చూసిన ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. పెరుగుతున్న కరోనా కేసులు, యూనిట్ లో కూడా కొందరు కోవిడ్ భారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Star Couples: అంతా మా ఇష్టం.. రెచ్చిపోతున్న హాట్ కపుల్స్!

విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ కథ రాయడం విశేషం కాగా మాటలు కూడా ఆయనే అందించారు. న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమాగా డీజే టిల్లు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించగా చివరికి ఉసూరుమనిపిస్తూ వాయిదా ప్రకటించారు.