Salaar: క్రేజీ టాక్.. భారీ స్థాయిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ రీషూట్?

కేజేఎఫ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఒకవైపు యష్ తో కేజేఎఫ్ సీక్వెల్ చేస్తూనే మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా..

Salaar: క్రేజీ టాక్.. భారీ స్థాయిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ రీషూట్?

Salaar

Salaar: కేజేఎఫ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఒకవైపు యష్ తో కేజేఎఫ్ సీక్వెల్ చేస్తూనే మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మేజర్ పార్ట్ పూర్తయింది. ఇక, మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఈ సినిమా మీద అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి.

Samantha: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!

వరసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకున్న ప్రభాస్ నుండి సలార్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమా విడుదల చేసేందుకు మిగతా పనులను కూడా మొదలు పెట్టారు. ముందుగా ఈ సినిమాకి సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తి చేయనున్న ప్రశాంత్.. ఇంటర్వెల్ సీక్వెన్స్ న రీషూట్ చేయాలని చూస్తున్నారట. ఔట్ ఫుట్ విషయంలో అసంతృప్తి కారణంగానే ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

Shraddha Das: శ్రద్ధా ఏందబ్బా ఇది.. మరీ ఇంతగా..

ఇంతకు ముందు తెరకెక్కించిన దానికంటే ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ఈ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ ఇందులో కోసం త్వరలోనే షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాడట. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని గతంలో ప్రచారం జరగగా.. ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. మరి ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్, స్పెషల్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.