SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

టాలీవుడ్ ట్రెండ్ మారింది. సినిమాల బడ్జెట్ ను లెక్కలోకి తీసుకోకుండా ప్రతి స్టార్ హీరో సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. రాబోతున్న సినిమాలన్నీ..

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

Ssmb 28

SSMB 28: టాలీవుడ్ ట్రెండ్ మారింది. సినిమాల బడ్జెట్ ను లెక్కలోకి తీసుకోకుండా ప్రతి స్టార్ హీరో సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. రాబోతున్న సినిమాలన్నీ నేషనల్ వైడ్ సినిమాలే. అందుకోసం తెలుగే కాదు ముంబై నుండి కేరళ వరకు ఎక్కడ స్టార్స్ ఉన్నా తెలుగు సినిమాల కోసం పట్టుకొస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మన సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో అమితాబ్ బచ్చన్ నుండి సల్మాన్ ఖాన్ వరకు అందరూ దిగిపోతున్నారు.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడప్.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ తెలుగులో అప్పుడెప్పుడో నాగార్జున సినిమాలో ఓ చిన్న అతిధి పాత్రలో నటించాడు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ మన సినిమాలలో పాత్రలకు సిద్ధంగా ఉండడంతో సంజయ్ కూడా సూపర్ స్టార్ తో జతకట్టనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ సినిమాకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మొదలు కానున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.

Manasanamaha: ఆస్కార్‌కు నామినేటైన తొలి తెలుగు షార్ట్ ఫిల్మ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

సంజయ్ మహేష్ సినిమాలో నటించే వార్త కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుండగా దాదాపుగా ఇది కన్ఫర్మ్ అని.. సంజయ్ పాత్ర కూడా ఇదేనని ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతుంది. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ ఓ అవినీతి గల రాజకీయ నాయకుడిగా సినిమాలో లాంగ్ రన్ పాత్రలో నటిస్తున్నాడట. అదే నిజమైతే ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం కాగా.. మేకర్స్ అధికారికంగా ఇది ప్రకటించాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ అండ్ కో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

Raai Laxmi: బాబోయ్.. ఏంటీ రచ్చ రత్తాలు!