Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగుచేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

Cultivation of sugarcane as an intercrop in palm oil

Intercrop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక, రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం మండలం , జగన్నాథపురం గ్రామంలో వంగా సత్యనారాయణ శ్రీధర్ పామాయిల్ మొక్కలు రెండేళ్ల క్రితం పెట్టారు.

READ ALSO : Sugarcane Crop : చలికాలంలో చెరకు పంటకు నష్టం కలిగించే తుప్పు తెగులు, నివారణ మార్గాలు!

అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి, మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందారు. ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగుచేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో టన్ను చెరకు ధర రూ. 3,200 పలుకుతోంది. పెట్టుబడి రూ. 30 అవుతుంది.

READ ALSO : Sugarcane Crop : తెగుళ్ళు, చీడపీడలు తట్టుకునేలా టిష్యూకల్చర్ తో చెరకు పంట సాగు!

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.