K Raghavendra Rao : ‘మౌనముని’ మాట్లాడబోతున్నారు.. నటుడిగా దర్శకేంద్రుడు!

సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు..

K Raghavendra Rao : ‘మౌనముని’ మాట్లాడబోతున్నారు.. నటుడిగా దర్శకేంద్రుడు!

Krr

K Raghavendra Rao: తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలుంటాయి. డైరెక్టర్, రైటర్, కొరియోగ్రాఫర్.. స్క్రీన్ మీద హీరోయిన్లను అందంగా చూపించాలన్నా, కొత్త హీరో, హీరోయిన్లను తెరకు పరిచయం చెయ్యాలన్నా ఆయన చెయ్యి పడాల్సిందే. ఆయనే శతాధిక చిత్రాల దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు.
ఆఫ్ స్క్రీన్ ఆర్టిస్టుల నుండి తనకు కావాల్సిన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టుకునే రాఘవేంద్ర రావు ఆన్ స్క్రీన్ ఒక్క మాట కూడా మాట్లాడరు.

K Raghavendra Rao

 

ఏదైనా సినిమా ఫంక్షన్‌కి వచ్చినా.. ‘టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, సాంగ్ రిలీజ్.. అందరికీ ఆల్ ది బెస్ట్’ ఈ మాటలు తప్ప ఆయన పెద్దగా మాట్లాడింది లేదు. అందుకే ఆయణ్ణి ‘మౌనముని’ అంటారు. అలాంటి రాఘవేంద్ర రావు నటిస్తే ఎలా ఉంటుంది..? వినడానికే వింతగా అనిపిస్తుంది కదూ.. అవును, ఇప్పుడు ఈ సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అది కూడా తన కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయిన ‘పెళ్లిసందడి’ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాతో కావడం విశేషం.

Krr

శిష్యురాలు గౌరీ రోనంకి డైరెక్షన్‌లో, తన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీలను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆర్కా మీడియా నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లిసందడి’ లో ‘వశిష్ట’ క్యారెక్టర్ ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు కెఆర్ఆర్.. రాఘవేంద్ర రావు నటిస్తున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెరమీద ఆయణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

అందుకు తగ్గట్లే ఇంట్రడక్షన్ వీడియో అదిరిపోయింది. స్టైలిష్‌గా గాగుల్స్ పెట్టుకుని, టీనేజ్ అమ్మాయిల నడుమ మఫ్టీలో ఉన్న మన్మథుడిలా, వాలీబాల్ ఆడుతూ ఇరగదీసేశారు రాఘవేంద్ర రావు. దర్శకధీరుడు రాజమౌళి తన గురువు గారు నటుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘పెళ్లిసందD’ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రాఘవేంద్ర రావుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లెటర్ షేర్ చేశారు.