David warner : ఏ సినిమా చూడాలి – డేవిడ్ వార్నర్

ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు. టెలివిజన్ స్క్రీన్ పై కనిపించిన భారతీయ సినిమాల పోస్టర్ ను ఉంది. ఆనంద్‌, బ‌ద్లా, బాహుబ‌లి, బ‌ర్ఫీ, దంగ‌ల్‌, గ‌ల్లీ బోయ్, దేవ‌దాస్‌, దిల్‌వాలే దుల్హానియా లే జాయెంగే త‌దిత‌ర చిత్రాల‌కు సంబంధించిన ఐకాన్‌లు ఉన్నాయి.

David warner : ఏ సినిమా చూడాలి – డేవిడ్ వార్నర్

David

David warner : డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియా జట్టులో ప్రధానమైన బ్యాట్స్ మెన్. క్రీజులో దిగిడంటే..తన బ్యాట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఇతను..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఇతను…పలు వీడియోలు, పోస్టులతో అభిమానులను అలరిస్తుంటాడు. తనలోని సృజనాత్మకతను బయటపెట్టారు. కరోనా.. లాక్డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

తాజాగా…ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు. టెలివిజన్ స్క్రీన్ పై కనిపించిన భారతీయ సినిమాల పోస్టర్ ను ఉంది. ఆనంద్‌, బ‌ద్లా, బాహుబ‌లి, బ‌ర్ఫీ, దంగ‌ల్‌, గ‌ల్లీ బోయ్, దేవ‌దాస్‌, దిల్‌వాలే దుల్హానియా లే జాయెంగే త‌దిత‌ర చిత్రాల‌కు సంబంధించిన ఐకాన్‌లు ఉన్నాయి. లాక్‌డౌన్‌, స్టే సేఫ్, స్టే హోమ్ అని కూడా క్యాప్ష‌న్ ఇచ్చారు. అయితే…ఇందులో ఏ సినిమా చూడాలి ? అంటూ భారత అభిమానులను ప్రశ్నించారు. ఇలా పోస్టు చేశారో..లేదో..నెటిజన్లు రియాక్షన్ అయ్యారు.

ఆ సినిమా చూడాలి..ఈ సినిమా చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేట్ శ్రీవాత్సవ్ గోస్వామి గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమా చూడమని రికమెండ్ చేశారు. తెలుగు సినిమాలైన అల వైకుంఠ‌పురంలో, వ‌కీల్ సాబ్‌, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ త‌దిత‌ర సినిమాల‌ను చూడాలంటూ…హైద‌రాబాదీలు సూచించారు.

డేవిడ్ వార్నర్ కు ఆస్ట్రేలియాతోపాటు భారత్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలో డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాకు సంబంధించిన సెలబ్రెటీల టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరించారు. ఆయన వీడియోలకు భారతీయుల నుంచి మంచి స్పందన లభించడంతో వార్నర్ దానిని కంటిన్యూ చేస్తూ వెళుతున్నారు.