Deepika Padukone : అక్కడ చిన్న చిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడ మంచి నటిగా చేయడం బెటర్..

దీపికా మాట్లాడుతూ.. టైమ్స్ 100లో చోటు దక్కినందుకు ఆనందిస్తున్నాను. అయితే ఈసారి నాలోని నటికి కాకుండా నాలోని శక్తిమంతురాలైన స్త్రీకి ఈ గుర్తింపు............

Deepika Padukone : అక్కడ చిన్న చిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడ మంచి నటిగా చేయడం బెటర్..

Deepika Padukone

Deepika Padukone :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇటీవలే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యురి మెంబర్ గా కూడా ఉండి మన దేశానికి ఎంతో వన్నె తెచ్చింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రకరకాల డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పై అలరించింది. తాజాగా కాన్స్ ఫెస్టివల్ ముగిసిన తరుణంలో దీపికా మరోసారి మీడియాతో ముచ్చటించింది. అలాగే ఈ సారి దీపికా టైమ్స్‌-100 జాబితాలో చోటు దక్కించుకుంది.

వీటిపై దీపికా మాట్లాడుతూ.. టైమ్స్ 100లో చోటు దక్కినందుకు ఆనందిస్తున్నాను. అయితే ఈసారి నాలోని నటికి కాకుండా నాలోని శక్తిమంతురాలైన స్త్రీకి ఈ గుర్తింపు ఇచ్చారు. నేను పద్దెనిమిదేండ్లకే మోడల్‌గా నా ప్రయాణం మొదలుపెట్టాను. నేను అథ్లెట్‌ని అని అందరికి తెలిసిందే. నా తండ్రి ప్రకాశ్‌ పదుకొనె నుంచి ఆట నాకు వారసత్వంగా వచ్చింది. అందుకే నా శరీరాన్ని, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అని తెలిపింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయిపొయింది. దీపికాని కూడా ఇక హాలీవుడ్ లో నటిస్తారా అని అడగడంతో హాలీవుడ్‌లో చిన్నచిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడే ఉండి మంచినటిగా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం అని తెలిపింది.