Project-K: ప్రభాస్ సినిమా.. ఆలోచిస్తేనే థ్రిల్లింగ్ గా ఉందన్న దీపికా!

ప్రభాస్ ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ హీరోగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది.

Project-K: ప్రభాస్ సినిమా.. ఆలోచిస్తేనే థ్రిల్లింగ్ గా ఉందన్న దీపికా!

Project K

Project-K: ప్రభాస్ ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ హీరోగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇప్పుడు మూడవ సినిమాను కూడా మొదలు పెట్టాడు. మహానటితో ప్రామిసింగ్ దర్శకుడిగా మారిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తర్వాత సినిమా చేయనున్నాడు.

అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్ శనివారం గురుపౌర్ణమి సందర్భంగా షూటింగ్ స్టార్ట్ అయింది. హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రాజెక్ట్-కే (Project-K) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

కాగా, ఈ సినిమా ప్రారంభంపై స్పందించిన దీపికా ఇన్ స్టాగ్రామ్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది ‘ప్రాజెక్ట్ –కే’ (Project-K)లో మొదటి రోజు.. ముందు రాబోయే వాటి కోసం ఆలోచిస్తేనే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది’ అని దీపికా పోస్ట్ చేసింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకు స్క్రిప్ట్ మెంటార్‌గా పనిచేస్తుండగా ఇటు ప్రభాస్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.

సాధారణ అభిమానులే కాదు ఈ సినిమాలో పనిచేసే స్టార్స్ కూడా ఈ సినిమా ఎలా ఉండనుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా ఇన్ స్టా పోస్ట్ చూస్తేనే ఇది అర్ధమవుతుంది. మరోవైపు మున్ముందు ఈ సినిమా నుంచి చాలానే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండడం ఖాయం అని టాక్ ఉంది. ఇక ఆ సర్ప్రైజ్ కూడా తోడైతే ఇక ఈ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడం కూడా కష్టమే.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)