Dhamaka: ధమాకా డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా..?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలిసిన దగ్గర్నుండీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, ఆ సందేహాన్ని రెట్టింపు చేశాయి.

Dhamaka: ధమాకా డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా..?

Dhamaka Director Trinadha Rao Nakkina Next Movie With Whom

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలిసిన దగ్గర్నుండీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, ఆ సందేహాన్ని రెట్టింపు చేశాయి.

Dhamaka : RRR, బాహుబలి తరువాత ఆ రికార్డు సాధించింది ధమాకా..

కానీ, ఈ సినిమాలోని ‘‘జింతాక్’’ సాంగ్ ఆ సందేహాలన్నింటిని తొలగించేసింది. ఈ సినిమా పక్కా మాస్ మూవీగా రాబోతుందని.. ఈ సినిమాతో రవితేజ సూపర్ హిట్ అందుకుంటాడని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్ రావడంతో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందా అని అందరూ అనుకున్నారు. కానీ, తొలిరోజు కంటే కూడా ఈ సినిమా తొలి వీకెండ్‌కు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఇక సినిమా రిలీజ్ అయిన పదిరోజుల్లోనే ఈ సినిమా థండరింగ్ కలెక్షన్స్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. రేపటితో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరుతుండటంతో ధమాకా సాలిడ్ హిట్ అనే బిరుదును వేసుకుంటుంది.

Dhamaka: రవితేజ తప్ప ఎవరు చేసినా ‘ధమాకా’ ఫ్లాప్.. బండ్ల గణేష్ కామెంట్స్!

అయితే ఇలాంటి ట్రెమెండస్ హిట్ అందుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు, తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా.. ఆయన నెక్ట్స్ మూవీలో ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా, నక్కిన త్రినాథరావు ప్రస్తుతం ధమాకా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుండగా, రవితేజ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్టులు రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు చిత్రాలను ముగించే పనిలో బిజీగా ఉన్నాడు.