Dhamaka: ఓటీటీలో పేలిన మాస్ బాంబ్.. ధమాకా సౌండ్ అదిరిందట!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ థియేటర్స్‌లో ఎలాంటి దుమ్ములేపిందో మనం చూశాం. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు సక్సెస్‌ను అందించింది.

Dhamaka: ఓటీటీలో పేలిన మాస్ బాంబ్.. ధమాకా సౌండ్ అదిరిందట!

Dhamaka Movie Released In OTT Platform

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ థియేటర్స్‌లో ఎలాంటి దుమ్ములేపిందో మనం చూశాం. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు సక్సెస్‌ను అందించింది. ఇక ఈ సినిమాలో ఆయన సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటించడంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Dhamaka: మాస్ రాజా ఫ్యాన్స్‌కు ధమాకా లాంటి న్యూస్.. ఇక ఓటీటీలో రచ్చరచ్చే!

ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ములేపింది. అంతేగాక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ధమాకా చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. జనవరి 22 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, అన్నట్లుగానే ఈ సినిమా నేటి తెల్లవారుజాము నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. మరి థియేటర్లలో దుమ్ములేపిన ధమాకా, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.