Dhanush : షూట్ మొదలు పెట్టిన ‘సార్’

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ్టి నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. కాలేజ్ డ్రెస్ లో ధనుష్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Dhanush : షూట్ మొదలు పెట్టిన ‘సార్’

Sir

Dhanush :  తమిళ స్టార్ హీరో ధనుష్ మోస్ట్ టాలెంటెడ్ హీరో. తన ప్రఫార్మెన్స్ తో అన్ని సినిమాలలోనూ మెప్పిస్తాడు. నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో కూడా డబ్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ధనుష్ కి మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తున్నాడు.

తెలుగులో చేస్తున్న సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘సార్’, తమిళ్ లో ‘వాతి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

Varalxmi Srathkumar : తెలుగు తెరపై కొత్త లేడీ విలన్.. వరుస సినిమాలతో బిజీ బిజీ..

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ్టి నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. కాలేజ్ డ్రెస్ లో ధనుష్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ధనుష్ లుక్ ఆసక్తిగా ఉంది. ప్రతి సినిమాకి అందులోని పాత్రకి తగ్గట్టు తనని తాను మార్చుకోగలడు ధనుష్. దీంతో ఈ సినిమాలో కూడా మరింత కొత్తగా కనపడనున్నాడని అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.