Hebah patel : హెబ్బా పటేల్ సర్జరీ చేయించుకుందా??

హెబ్బా తాను బొద్దుగా ఉన్న ఫోటోలు షేర్ చేసినప్పుడు తనని బాగా ట్రోల్ చేశారు. లావు అయ్యావు, అందుకే అవకాశాలు రావట్లేదు, కొంచెం సన్నగా తయారవ్వు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు...

Hebah patel : హెబ్బా పటేల్ సర్జరీ చేయించుకుందా??

Hebba

 

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకొని అభిమానులని సంపాదించుకుంది హెబ్బా. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు తప్ప మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ వచ్చిన సినిమా ఏది లేదు. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను పెడుతూ అభిమానులకి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం హెబ్బా పెట్టిన కొన్ని ఫొటోల్లో కాస్త లావుగా ఉంది. కానీ ఇటీవలి ఫొటోల్లో మళ్ళీ గతంలో లాగే సన్నగా అయింది.

 

హెబ్బా తాను బొద్దుగా ఉన్న ఫోటోలు షేర్ చేసినప్పుడు తనని బాగా ట్రోల్ చేశారు. లావు అయ్యావు, అందుకే అవకాశాలు రావట్లేదు, కొంచెం సన్నగా తయారవ్వు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. గత కొంతకాలంగా హెబ్బాకి చెప్పుకోతగ్గ సినిమాలు కూడా లేవు. తాజాగా హెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్‌కి వచ్చి అభిమానులతో ముచ్చటించింది. ఈ లైవ్‌లో హెబ్బా నాజూగ్గా, సన్నగా మారి మరింత అందంగా కనిపించింది.

Hebah Patel : అదిరిపోయే పాత ఫోటోలని షేర్ చేసిన హెబ్బా.. వీటితో అవకాశాలు వచ్చినట్టేనా??

అయితే ఈ లైవ్‌లో హెబ్బాని సన్నబడటం చూసి కొంతమంది దీని గురించి అడిగారు. ఇటీవల లావుగా అయ్యారు, మళ్ళీ సన్నపడ్డారు, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పరా? అని అడగడంతో హెబ్బా.. ”అదో పెద్ద సీక్రెట్‌.. ఇప్పటివరకు ఈ రహస్యం ఎవరికి చెప్పలేదు. నాకు అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చింది” అని తెలిపింది. దీంతో ఇన్‌డైరెక్ట్ గా హెబ్బా సర్జరీ చేయించుకున్నట్లు తెలుపుతుంది. హెబ్బా పటేల్ బాడీ ట్రాన్స్‌ఫామింగ్‌ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఆమె ఇన్‌డైరెక్ట్ గా చెప్పినా సన్నిహితుల నుంచి ఈ సమాచారం బయటకి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా హెబ్బా పటేల్ గతంలో లాగా అందంగా తయారయి సోషల్ మీడియాలో తన అందాలను పరుస్తూ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. మరి ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.