Periods Diet : పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం!

ఐరన్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసేందుకు ఈ తరహా ఆహారాలు తోడ్పడతాయి. బచ్చలికూర, అరటిపండు, గుమ్మడికాయ, దుంప వంటి ఆమారాలతోపాటుగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి.

Periods Diet : పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం!

Period

Periods Diet : నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలు బాధిస్తుంటాయి. పిరియడ్స్ వచ్చినప్పుడు నీరసంగా, చికాకుగా కనిపిస్తారు. పెద్దగా తినాలన్న ఆసక్తి ఉండదు. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి లభించకుండా పోతుంది. పీరియడ్స్ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగతమైన పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించటం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా నెలసరి సమయంలో వచ్చే సమస్యలను సులభంగా అదిగమించవచ్చు.

నెలసరి సమయంలో తాజా పండ్లరసాలు, తక్షణ శక్తినిచ్చే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పెరుగు, ఒమేగా-3 అధికంగా ఉండే నట్స్‌, తాజా కూరగాయలు, తాజా పండ్లు వంటి వాటిని తీసుకోవాలి. ఈ సమయంలో అధిక రక్తస్రావం వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో రక్తాన్ని కోల్పోతుంది. నీరసం వంటివి లేకుండా ఉండేందుకు మనం సాధారణంగా తినే పౌష్టికాహారం కంటే ఎక్కువగా పీరియడ్స్ సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాటం వల్ల ఒత్తిడి తగ్గి నెలసరితో వచ్చే చికాకులు వంటివి లేకుండా చూసుకోవచ్చు.

ఐరన్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసేందుకు ఈ తరహా ఆహారాలు తోడ్పడతాయి. బచ్చలికూర, అరటిపండు, గుమ్మడికాయ, దుంప వంటి ఆమారాలతోపాటుగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పప్పులు, మిల్క్‌షేక్‌లు, పెరుగు, పాలు, నాన్ వెజ్, గుడ్డు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలు మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో కాల్షియం కొరత ఉండకూడదు. లేదంటే కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటారు. ఇందుకోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నిషియం ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

వేడి వేడి అల్లం టీ ఒక కప్పు తాగటం వల్ల ఋతుస్రావం యొక్క కొన్ని లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. వికారం తగ్గిస్తుంది. అల్లం ఎక్కువగా తినవద్దు. ఒక రోజులో 4 గ్రాముల కంటే ఎక్కువ తినడం వల్ల గుండెల్లో మంట మరియు కడుపునొప్పి వస్తుంది.పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహారాలను తీసుకోవద్దంటు కొంతమంది సూచిస్తుంటారు. ప్రధానంగా పెరుగు, దానిమ్మగింజలు, ఊరగాయ పచ్చళ్లు వంటి వాటిని తీసుకోవద్దని చెబుతుంటారు. అయితే వాటిని తీసుకోకూడదన్న నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలు లేకుండా ఉండేందుకు సులభంగా జీర్ణమయ్యే వాటిని తీసుకోంటే మేలు కలుగుతుందని వారి సూచనల్లో భావనను అర్ధం చేసుకోవాలి. అదే క్రమంలో ఎక్కువ మోతాదులో ఉప్పు, పంచదార, కాఫీ, మద్యం, స్పైసీ ఫుడ్స్, రెడ్ మీట్, వంటివాటిని తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.