Dimple Hayathi : ఆడిషన్స్‌కి వెళ్తే నల్లగా ఉన్నానన్నారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి మాట్లాడుతూ.. ''గద్దలకొండ గణేష్‌ సినిమా ముందు వరకు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు............

Dimple Hayathi : ఆడిషన్స్‌కి వెళ్తే నల్లగా ఉన్నానన్నారు

Dimple Hayati (image:instagram)

Dimple Hayathi :  తెలుగమ్మాయి డింపుల్ హయతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఒకప్పుడు అవకాశలకోసం తిరిగింది, అవమానాలు ఎదుర్కొంది. ‘గల్ఫ్’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గద్దలకొండ గణేష్‌ సినిమాలో ‘జర్రా జర్రా’ ఐటెం సాంగ్‌తో స్టార్ అయిపొయింది డింపుల్‌ హయతి. ఆ తర్వాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకోంటోంది.

 

డింపుల్ రవితేజ సరసన చేసిన ఖిలాడి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం డింపుల్ కి రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ్ సినిమా చేతిలో ఉన్నాయి. ఇటీవల ‘ఆత్రంగి రే’ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. ఖిలాడీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండటంతో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పడిన సినిమా కష్టాలు తెలిపింది.

Spidar Man : 36 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్ కోసం ఖరీదైన ఇల్లు కొన్న స్పైడర్ మ్యాన్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి మాట్లాడుతూ.. ”గద్దలకొండ గణేష్‌ సినిమా ముందు వరకు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్‌ స్కిన్‌ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. నల్లగా ఉన్నాను పనికిరాని అనేవాళ్ళు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. కానీ నేను నటిగా నిరూపించుకోవాలని ఐటెం సాంగ్స్ మళ్ళీ చేయలేదు. ఇప్పుడు ‘ఖిలాడీ’ సినిమాతో నటిగా నిరూపించుకోబోతున్నాను. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ వస్తే మళ్ళీ చేస్తాను” అని తెలిపింది.