Director Bala : ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యతో విడిపోయిన స్టార్ డైరెక్టర్

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. చాలా మంది తెలిసిన, కొంతమంది తెలియని సెలబ్రిటీలు ఇటీవల వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. సమంత- నాగచైతన్య...

Director Bala : ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యతో విడిపోయిన స్టార్ డైరెక్టర్

Bala

Director Bala :  ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. చాలా మంది తెలిసిన, కొంతమంది తెలియని సెలబ్రిటీలు ఇటీవల వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. సమంత- నాగచైతన్య, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ధనుష్- ఐశ్వర్య… ఇలా వీళ్ళే కాకుండా చిన్న చిన్న సెలెబ్రిటీలు కూడా చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ బాల తన భార్యతో విడాకులు తీసుకున్నారు.

Varalaxmi Saratkumar : వరుస సినిమా ఆఫర్లతో హైదరాబాద్‌కి మకాం మార్చిన తమిళ స్టార్

వాడు-వీడు, శివపుత్రుడు లాంటి సినిమాలతో తెలుగు వాళ్లకి కూడా పరిచయమైనా బాలకి 17 సంవత్సరాల క్రితం ముత్తు మలర్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నాలుగేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు. ఇటీవల భార్యతో విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించగా తాజాగా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో వీరి విడాకులు వైరల్ అవుతున్నాయి.