Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్..
ఒక మూవీ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ని ఒక ఇంటి ఓనర్ తిట్టిన విషయం తెలుసుకొని.. చిరంజీవి అతనికి ఫోన్ చేసి ఎవడివురా నా తమ్ముడిని తిట్టడానికి అని పచ్చి బూతులు తిట్టాడట.
![Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్.. Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్..](https://10tv.in/wp-content/uploads/2023/08/Director-Bobby-shares-rare-incident-about-Chiranjeevi-Pawan-Kalyan-relation.jpg)
Director Bobby shares rare incident about Chiranjeevi Pawan Kalyan relation
Chiranjeevi – Pawan Kalyan : మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. సోషల్ మీడియాలో, మీడియా ఆర్టికల్స్ లో వీరి బంధం గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా.. వారిద్దరి మధ్య బాండింగ్ గురించి మెగా అభిమానులకు బాగా తెలుసు. తన పై, కుటుంబం పై ఎన్ని విమర్శలు వచ్చినా చిరంజీవి గారికి అసలు కోపం రాదని అందరూ చెబుతుంటారు. కానీ అది తప్పు అని, చిరంజీవికి తన తమ్ముడు పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే ఎంత కోపం వస్తుందో.. దర్శకుడు బాబీ ఒక విషయం చెప్పి అందరికి తెలియజేశాడు.
Hyper Aadi : మెగా ఫ్యామిలీని విమర్శించే వారికీ హైపర్ ఆది పంచ్.. కుర్చీ మడత పెట్టి..
భోళాశంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాబీ మాట్లాడుతూ..
“పవన్ కళ్యాణ్ గారికి సంబంధిన ఒక మూవీ షూటింగ్ ఒక అద్దె ఇంటిలో జరిగింది. ఆ సమయంలో లైటింగ్ యూనిట్ వాళ్ళు ఇంటిలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కరెంటుతో పని కాబట్టి వాళ్ళు ఇంటిలో కూడా చెప్పులు వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇంటి ఓనర్ దాని పై కోపం వ్యక్తం చేస్తూ లైటింగ్ యూనిట్ పై గొడవ పడ్డాడు. ఇక అది విన్నా పవన్ గారు ఆ ఓనర్ తో మాట్లాడుతూ.. మీరు డబ్బులు తీసుకునే కదా ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పారు.
Tamannaah : తమన్నాని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటున్న చిరు.. వాళ్ళ నాన్నకు సర్జరీ జరిగినా..?
కానీ ఆ ఓనర్ పవన్ గారి పై కూడా అరిచాడు. ఇంటిలో నుంచి పవన్ గారిని వెళ్ళిపోమన్నాడు. దీంతో పవన్ గారికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం ఎక్కడో షూటింగ్ లో ఉన్న చిరంజీవి గారికి తెలిసింది. ఆయన వెంటనే ఆ ఇంటి ఓనర్ కి ఫోన్ చేశారు. అతను కాల్ లిఫ్ట్ చేయడంతోనే ముందుగా చిరంజీవి గారు ఆ ఇంటి ఓనర్ ని పచ్చి బూతులు తిట్టారు. నువ్వు ఎవడివురా నా తమ్ముడిని తిట్టడానికి అని ఎడాపెడా తిట్టేశారు”.