Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

పుష్ప సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను.. ఓ రేంజ్ లో పొగిడేశారు.. దర్శకధీరుడు జక్కన్న అలియాస్ రాజమౌళి.

Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Rraa

Pushpa: పుష్ప సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను.. ఓ రేంజ్ లో పొగిడేశారు.. దర్శకధీరుడు జక్కన్న అలియాస్ రాజమౌళి. టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన బెస్ట్ గిఫ్ట్ బన్నీ అని ప్రశంసించిన జక్కన్న.. ఆయన్ను చూసి కొత్త హీరోలు చాలా నేర్చుకోవాలని అన్నారు. ఈ సినిమా విడుదల కోసం ముంబైలో చాలామంది ఎదురు చూస్తున్నారని.. ప్రమోషన్స్ ను ఇక్కడితో ఆపకుండా అక్కడ కూడా తప్పక చేయాలని.. బన్నీకి సూచించారు… రాజమౌళి. హైదరాబాద్ లో జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ తో అందరినీ అట్రాక్ట్ చేశారు.. రాజమౌళి.

దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. తను సుక్కూకు అభిమానిని అని చెప్పారు. తమ సినిమాలు వచ్చినప్పుడు.. ఇద్దరం ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటూ ఉంటామన్నారు. “ఈ మధ్య ఫుల్ బిజీగా ఉన్నట్టు సుక్కూ చెబుతున్నాడు. కానీ.. సినిమాపై పూర్తి శ్రద్ధ పెట్టాలని చెప్పాను. ఆ మాట ప్రకారం ఇప్పుడు ముంబైలో పుష్ప పనిమీదే సుక్కూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయం. ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన పని లేదు” అని రాజమౌళి చెప్పారు.

ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేసినా క్షణాల్లో టికెట్లు అయిపోతున్నాయన్న వార్తలు.. చాలా ఆనందాన్ని కలిగిస్తున్నట్టు రాజమౌళి చెప్పారు. ఈ సినిమాను అంతా డిసెంబర్ 17న థియేటర్లలో చూద్దామన్నారు. అలాగే.. సినిమా ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందంటూ.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీని స్పెషల్ గా అప్రిషియేట్ చేశారు.. రాజమౌళి.