Directors : స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్స్

స్టార్ హీరోల కోసం కొందరు డైరెక్టర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని కాచుకూర్చున్నారు. రెడీ చేసిన స్క్రిప్ట్ పట్టుకుని....................

Directors :  స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్స్

Directors

 

Star Heros :  స్టార్ హీరోల కోసం కొందరు డైరెక్టర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని కాచుకూర్చున్నారు. రెడీ చేసిన స్క్రిప్ట్ పట్టుకుని హీరోలకు గుర్తు చేస్తున్నారు కానీ మాకు కాస్త టైమ్ కావాలంటున్నారు స్టార్స్. కొత్తగా వచ్చిన పాన్ ఇండియా కిరీటంతో హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలా అని ఆలోచిస్తుంటే ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ కి ఏం చేయాలో తోచట్లేదు.

ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. తారక్ తోనే సినిమా చేస్తానని పట్టుబట్టాడు బుచ్చిబాబు సానా. ఉప్పెనతో సాలిడ్ హిట్ కొట్టాక ఎన్టీఆర్ సినిమా ఓకే చేయడంతో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఎన్టీఆర్ తోనే పట్టాలెక్కుతానని భీష్మించుకు కూర్చున్నాడు. చూస్తే తారక్ ముందు కొరటాల శివతో సినిమా పూర్తి కావాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. దీంతో 2023 చివరి వరకు తారక్ డేట్స్ ఖాళీగా లేవు. దీంతో ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నాడు. బుచ్చిబాబుతో పాటు వక్కంతం వంశీ, తమిళ్ డైరెక్టర్ అట్లీ కూడా ట్రై చేస్తున్నారు.

ఎన్టీఆర్ డేట్స్ కోసం చూసి చూసి చివరికి నితిన్ తో సినిమాను ఫైనల్ చేసాడు వక్కంతం వంశీ. తమిళ్ డైరెక్టర్ అట్లీ కూడా జూనియర్ తో సినిమా చేసేందుకు బాగానే ట్రైల్స్ వేసినా వర్కవుట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం షారుఖ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన తమిళ్ లోనే సినిమా తీయొచ్చని సమాచారం.

పవర్ స్టార్ కి పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ వేణూశ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో బన్నీ హీరోగా ఐకాన్ సినిమాను ప్రకటించారు. కానీ పుష్పతో బన్నీ రేంజ్ అమాంతం పెరగడంతో ఐకాన్ ను పక్కన పెట్టేసారు అల్లు అర్జున్. దీంతో పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్టు ఐకాన్ సబ్జెక్ట్ ను రీవర్క్ చేయడం వేణూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుకుమార్, బోయపాటి సినిమాలు ఫిక్స్ చేసిన బన్నీ వేణు శ్రీరామ్ కి డేట్స్ ఇవ్వాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

ఇక ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కూడా బ‌న్నీతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే బన్నీ పుష్ప 2 సినిమా చేస్తుండడంతో బోయ‌పాటి రామ్ తో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో బన్నీతో సినిమా తీయడానికి బోయపాటి కూడా వెయిట్ చేయాల్సిందే.

పవన్ కల్యాణ్ కోసం వెయిట్ చేసే డైరెక్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూట్ కి పవన్ డేట్స్ కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ ఎదురు చూస్తున్నాడు. భవధీయుడు భగత్ సింగ్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సెట్స్ పైకెళ్లలేదు. మధ్యలో పవన్ తో దిగిన ఫోటోలు ట్వీట్ చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడం తప్ప హరీశ్ ఎప్పుడు సినిమాను స్టార్ట్ చేస్తాడనేది మాత్రం రివీల్ చేయట్లేదు. హరీష్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం ఈ కాంబోలో సినిమా ప్రకటించినా ఇప్పటిదాకా దాని ఊసే లేదు. పవన్ నుంచి ఎలాంటి పిలుపు రాబోయేసరికి సురేందర్ రెడ్డి అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరితో పాటు తమిళ్ డైరెక్టర్ సముద్రఖని కూడా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం రీమేక్ ను పవన్ ఓకే చేశారని చెప్పాడు సముద్రఖని. పవన్ వెయిటింగ్ లిస్ట్ లో ఈ డైరెక్టర్ కూడా చేరిపోయాడు.

Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి

ప్రభాస్ కోసం చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసి సలార్, ప్రాజెక్టు k షూట్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ గ్యాప్ లో మారుతి సినిమా అనౌన్స్ చేయడంతో మారుతి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక సందీప్ వంగతో కూడా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైంది. సందీప్ వంగా కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.

Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??

మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేసి వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. చిరు ఇప్పుడు ఒకేసారి మెహర్ రమేష్, మోహన రాజా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. దీంతో లైన్ లో ఉన్న వెంకీ కుడుముల చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయి వెంకీ దగ్గరికి వచ్చేసరికి రెండేళ్లు పెట్టొచ్చని అంటున్నారు.

ఇలా చాలా మంది డైరెక్టర్స్ స్టార్ హీరోలతో సినిమాలు ఓకే చేయించుకొని వారి డేట్స్ కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యేసరికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి.