Green Mango : పచ్చిమామిడిలో పోషకాలు ఎన్నో తెలుసా?

ప‌చ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాలను సుర‌క్షితంగా ఉంచుతాయి.

Green Mango : పచ్చిమామిడిలో పోషకాలు ఎన్నో తెలుసా?

Green Mango

Green Mango : వేసవి కాలంలో మామిడి కాయలు విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా పుల్లటి పచ్చిమామిడికాయను తినేందుకు , కూరల్లో ఉపయోగించుకునేందుకు ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. పుల్లటి పచ్చిమామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. పచ్చిమామిడిలో చక్కెర శాతం సమస్యే లేదు. కెలొరీలను కరిగించే పదార్ధాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి మామిడిని పచ్చడి రూపంలో గాని, కూరల్లో గాని చేర్చుకోవచ్చు.

పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటుగా కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. వేసవిలో చెమట అధికంగా పట్టటం వల్ల లవణాలను ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. పచ్చిమామిడి కాయ రసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే సమస్య నుండి బయటపడవచ్చు. చిగుళ్ళు ఇన్ ఫెక్షన్లు, రక్తం కారటం, పన్ను నొప్పి వంటి సమస్యలున్న వారు పచ్చి మామిడి కాయ ముక్కలను నమిలి తినటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.

నోటిలోని బ్యాక్టీరియా, క్రిములూ నశిస్తాయి. దంతాలు శుభ్రమవుతాయి. పళ్ల మీద ఎనామిల్ పోకుండా ఉంటుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. పచ్చి మామిడి తినటం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను పోగొడతాయి. వేసవిలో వచ్చే చెమటకాయలు తొలగిపోతాయి. శరీరంలో వేడి దూరమౌతుంది. గర్భిణులకు వాంతులూ, వికారం వల్ల అసౌకర్యం కలిగిన సందర్భంలో పచ్చిమామిడి తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్దక సమస్య ఉన్నవారు కొద్దిగా పచ్చిమామడికాయను చప్పరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మధ్యాహ్నం భోజనం తరువాత చాలా మంద బద్దకంగా మంచానికే పరిమితం కావాలనిపిస్తుంది. అలాంటి వారు పచ్చి మామిడి కాయ ముక్కల్ని తినటం వల్ల చురుగ్గా ఉంటారు. ఎసిడిటీ వల్ల చాతిలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటూ సమస్య తొలగిపోతుంది. పచ్చిమామిడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం కాలేయ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది . పిత్తాశయంలో ఆమ్లామలను ప్రేరేపించి జీర్ణరసాలను పెంచతుంది.

ప‌చ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాలను సుర‌క్షితంగా ఉంచుతాయి. ప‌చ్చి మామిడికాయ‌ల్లో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తుంది. క‌నుక హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ప‌చ్చి మామిడి కాయ‌ల్లో లుటీన్‌, జియాజాంతిన్ అనబ‌డే యాంటీ ఆక్సిడెంట్లు క‌ళ్ల‌లోని రెటీనాను సంర‌క్షిస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. చ‌ర్మం కాంతివంతంగా మారి చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.