Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన సమంతకి అప్పటినుంచే ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. కరోనా లక్షణాలు ఉన్నాయేమో, సమంత తీవ్ర అనారోగ్యం పాలైందని సోషల్ మీడియాలో.....

Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

Samantha

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత నిన్న అస్వస్థతకు గురైంది. జ్వరం, జలుబు, దగ్గుతో ఆమె బాధపడుతున్నట్టు, చికిత్స కోసం నిన్న ఉదయం హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. అయితే దీనిపై సోషల్ మీడియాలో సమంతకు కరోనా అంటూ తప్పుడు ప్రచారం చేశారు. మొన్న కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన సమంతకి అప్పటినుంచే ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. కరోనా లక్షణాలు ఉన్నాయేమో, సమంత తీవ్ర అనారోగ్యం పాలైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై సమంత అభిమానులు ఆందోళన చెందారు.

Miss Universe : మిస్ యూనివర్స్ గెలవగానే నాకే కాల్ చేసింది : ఉపాసన

అయితే సోషల్ మీడియాలో సమంతపై వస్తున్న వార్తల్ని సమంత సిబ్బంది ఖండించారు. నిన్న రాత్రి సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దగ్గు ఇబ్బందిపెడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చారని, ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సమంత మేనేజర్ తెలిపారు. దీంతో సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.