Dulquer Salmaan : దుల్కర్‌ని నిలబెట్టి షూట్ మధ్యలో హస్బెండ్‌తో హీరోయిన్ ఫోన్ మాట్లాడుకుంటుంది.. ప్రొడ్యూసర్స్ పై ఫైర్ అయిన రానా

తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Dulquer Salmaan : దుల్కర్‌ని నిలబెట్టి షూట్ మధ్యలో హస్బెండ్‌తో హీరోయిన్ ఫోన్ మాట్లాడుకుంటుంది.. ప్రొడ్యూసర్స్ పై ఫైర్ అయిన రానా

Dulquer Salmaan effected by a Bollywood heroine Rana said interesting facts in King of Kotha Pre Release Event

Dulquer Salmaan :  మలయాళం(Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మళయాళంతో పాటు ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తన మలయాళం సినిమాలని కూడా పాన్ ఇండియా రేంజ్ లో అని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవలే సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు దుల్కర్ కింగ్ అఫ్ కోత(King of Kotha) అనే మాస్ యాక్షన్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది.

మొదటి సారి దుల్కర్ ఫుల్ మాస్ రోల్ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

రానా మాట్లాడుతూ.. దుల్కర్ చాలా మంచివాడు. సైలెంట్ గా, పద్దతిగా ఉంటాడు. అతను ఇలాంటి మాస్ సినిమా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. యాక్టింగ్ స్కూల్ లో నా జూనియర్ దుల్కర్. అప్పట్నుంచి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. అతను ఎంత మంచివాడు అంటే దుల్కర్ ఒక బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. మా ఇంటి దగ్గరే షూటింగ్. ఆ సినిమా నిర్మాతలు నాకు బాగా తెలుసు. నేను ఖాళీగా ఉండి సెట్ కి వెళ్ళాను. అప్పటికి ఒక సీన్ మధ్యలో బాలీవుడ్ హీరోయిన్ వాళ్ళ భర్త ఫోన్ చేస్తే వెళ్లి మాట్లాడుకుంటుంది. అది కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. షాపింగ్ కోసం అంట. ఆమె ఫోన్ అయ్యేదాకా దుల్కర్ అక్కడే సెట్ లో నిలబడి ఉన్నాడు. ఆమె నన్ను చూసి నా దగ్గరికి వస్తుంటే షాట్ రెడీగా ఉంది వెళ్ళండి అని పంపించాను. మళ్ళీ ఇంకో ఫోన్ కోసం వెళ్ళింది షాట్ గ్యాప్ లో. నాకు అయితే చాలా కోపం వచ్చి చేతిలో బాటిల్ విసిరేసా. కానీ దుల్కర్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఎప్పుడు వస్తే అప్పుడు యాక్ట్ చేశాడు. షూట్ అయ్యాక ఆమె హడావిడి చేసుకుంటూ మూడు కార్లలో మంది మార్బలంతో వెళ్ళింది. దుల్కర్ సింపుల్ గా ఒక కార్ లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ షాట్ మధ్యలో అలా ఫోన్స్ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని నిర్మాతలపై అరగంట సేపు ఫైర్ అయి తిట్టేశాను. దుల్కర్ అంత మంచివాడు పక్కనోళ్ళ వల్ల ఇబ్బంది పడినా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటాడు. అలాంటింది దుల్కర్ ఇలాంటి మాస్ సినిమా చేస్తున్నాడంటే ఆశ్చర్యపోయాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Karthikeya 3 : కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి.. ఎప్పుడంటే..?

దీంతో దుల్కర్ ని అంతలా నిలబెట్టిన ఆ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ ఎవరా అని ఆరా తెస్తున్నారు. అయితే దుల్కర్ చేసిన హిందీ సినిమాల లిస్ట్ తీసి అందులో హీరోయిన్స్ లిస్ట్ చూస్తే రానా చెప్పింది సోనమ్ కపూర్ గురించి అని తెలుస్తుంది. సోనమ్ కపూర్(Sonam Kapoor), దుల్కర్ కలిసి 2019లో ది జోయా ఫ్యాక్టర్ అనే సినిమా తీశారు. బహుశా ఈ సినిమా సమయంలోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.