Dulquer Salmaan : కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్.. తన పాత్రపై కామెంట్స్.. ప్రభాస్తో కాంబినేషన్ సీన్స్??
‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani), రానా దగ్గుబాటి(Rana Daggubati) ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
![Dulquer Salmaan : కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్.. తన పాత్రపై కామెంట్స్.. ప్రభాస్తో కాంబినేషన్ సీన్స్?? Dulquer Salmaan : కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్.. తన పాత్రపై కామెంట్స్.. ప్రభాస్తో కాంబినేషన్ సీన్స్??](https://10tv.in/wp-content/uploads/2023/08/dulquer-salman.jpg)
Dulquer Salmaan playing a guest role in Prabhas Kalki 2898AD Movie Reveals in King of Kotha Movie Promotions
Dulquer Salmaan : ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఇటీవలే ఈ సినిమాకు ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ని హాలీవుడ్(Hollywood) లోని కామిక్ కాన్(Comic Con)ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇక గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ ని మించి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani), రానా దగ్గుబాటి(Rana Daggubati) ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. వీరే కాక ఇంకా చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నట్టు సమాచారం. తాజాగా కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. దుల్కర్ కల్కిలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చినా దుల్కర్ నుంచి కానీ, చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
దుల్కర్ సల్మాన్ త్వరలో కింగ్ అఫ్ కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో దుల్కర్ మాట్లాడుతూ కల్కి సినిమా గురించి మాట్లాడారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అవును, నేను కల్కి సినిమాలో ఉన్నాను. అసలు సెట్ లోకి అడుగుపెట్టగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. సినిమా చాలా గొప్పగా ఉండబోతుంది. చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి. అదంతా నాగి వల్లే. నాగి మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంకు, మహానటికి సంబంధం ఉండదు. ఇప్పుడు కల్కికి కూడా ఉండదు. ఇదంతా ఫ్యూచర్ కి సంబంధించి ఉంటుంది. ప్రభాస్ తో సీన్స్ అంటే ఇంకా నేనేమి చెప్పను సినిమా గురించి. ఇంతకంటే ఎక్కువ రెవీల్ చేయకూడదు అని తెలిపారు.
Baby Movie : ఆహాలోకి వచ్చేస్తున్న ‘బేబీ’ మూవీ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
దీంతో దుల్కర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. దుల్కర్ కల్కిలో ఉన్నాను అని చెప్పడం, సినిమాపైన హైప్ మరింత పెంచడంతో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కానుంది.
Reportedly, #DulquerSalmaan is part of #Kalki2898AD.#Prabhas pic.twitter.com/t0Zd1TtVK5
— Manobala Vijayabalan (@ManobalaV) August 17, 2023