Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘సీతా రామం’’పై యావత్ సౌత్ ఇండస్ట్రీలో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రేమకథా చిత్రాలను.....

Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!

Dulquer Salmaan Sita Ramam Teaser Talk

Sita Ramam: దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘సీతా రామం’’పై యావత్ సౌత్ ఇండస్ట్రీలో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్పెషలిస్ట్. అంతేగాక, ఈసారి సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ అయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను హీరోగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sita Ramam: ఓహ్ సీత.. హే రామ.. బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అవుట్!

కాగా.. తాజాగా ‘సీతా రామం’ సినిమా నుండి టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో దుల్కర్ సల్మాన్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. మిలటిరీలో పనిచేసే జవాన్‌గా దుల్కర్ మనకు కనిపిస్తాడు. అయితే అతడికి ఎవరూ లేరని చెప్పుకుంటాడు. కానీ అతడి పేరుపై కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. తన భార్య సీత ఈ ఉత్తరాలు రాస్తున్నట్లుగా మనకు టీజర్‌లో చూపించారు. మరి నిజంగానే రామ్‌కు సీతతో పెళ్లయ్యిందా.. లేక ఇదంతా కేవలం అతడి బ్రమ అనేది తెలియాలంటే సీతా రామం సినిమా చూడాల్సిందే.

SitaRamam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ‘సీతా రామం’.. గ్లిమ్ప్స్ రిలీజ్!

ఇక ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి చాలా ప్రెస్టీజియిస్‌గా తీసుకున్న సంగతి ఈ సినిమా విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది. పిఎస్ వినోద్ పనితనం ఎలా ఉంటుందో ఈ టీజర్‌లోనే మనకు చూపించారు. ఇక సినిమా మొత్తం చూస్తే ఆయన ఈ సినిమాను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో తెలుస్తోంది. అటు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ కానుంది. రామ్ పాత్రలో దుల్కర్ నటిస్తుండగా, సీత పాత్రలో మృనాల్ ఠాకూర్ నటిస్తోంది. అంతేగాక ఈ సినిమాలో సుమంత్, రష్మిక మందన కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.