Eesha Rebba : లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయిన ఈషారెబ్బ

ఈషా రెబ్బ ఇటీవలే మలయాళంలో కుంచకోబోబన్ సరసన 'ఒట్టు' అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమాలో హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయి నటించిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా......

Eesha Rebba : లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయిన ఈషారెబ్బ

Esha Rebba

Eesha Rebba :   తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది సక్సెస్ సాధిస్తారు. తొందరగా స్టార్ హీరోయిన్ అవ్వలేరు. హీరోయిన్ గా చేసినా చిన్న హీరోయిన్ గానే ఉండిపోతారు. వేరే భాషల్లోకి వెళ్తే కాస్తో కూస్తో పేరు, డబ్బు సంపాదించుకుంటారు. ఇది ఎప్పట్నుంచో వస్తుందే. అందుకే తెలుగు హీరోయిన్స్ కి ఇక్కడ సరిగ్గా అవకాశాలు రాకపోతే పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతారు. అలా వెళ్లి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే కోవలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ చేరనుంది.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బ. ఆ తర్వాత హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలానే సినిమాలు చేసింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాలేదు. మొన్నటి వరకు పద్దతిగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ, పద్దతిగా ఫోటోలు పెడ్తూ కనిపించేది. కానీ ఇటీవల బోల్డ్ నెస్ పెంచింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది ఈషా రెబ్బ. ఇటీవల బోల్డ్ క్యారెక్టర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని చేస్తుంది. అయినా అవకాశాలు తలుపు తట్టట్లేదు.

Nanditha Das : హీరోయిన్ డైరెక్షన్‌లో డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ

దీంతో ఒకపక్క తన బోల్డ్ నెస్ ని కంటిన్యూ చేస్తూనే వేరే భాష సినిమాల్లో ఛాన్సులు ట్రై చేస్తుంది. ఇటీవలే ఒక తమిళ్, ఒక మలయాళం సినిమాలో ఛాన్సులు వచ్చాయి. మలయాళంలో కుంచకోబోబన్ సరసన ‘ఒట్టు’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమాలో హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయి నటించిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన ఓ వీడియో సాంగ్ లో హీరోతో లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ చూసిన తెలుగు ప్రేక్షకులంతా ఇది ఈషా రెబ్బనేనా అని అనుకుంటున్నారు. అవకాశాలు ఎక్కువ రాకపోవడంతో తనలోని బోల్డ్ నెస్ ని బయట పెడుతుంది ఈ తెలుగు బ్యూటీ. మరి ఇలా అయినా సక్సెస్ వస్తుందేమో చూడాలి.