Encounter : అనంత్‌నాగ్‌‌‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అర్వానీ ప్రాంతంలోని ముమన్‌హాల్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Encounter : అనంత్‌నాగ్‌‌‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Encounter

Encounter : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అర్వానీ ప్రాంతంలోని ముమన్‌హాల్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ విషయాన్నీ జమ్మూకశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

చదవండి : Encounter: ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఈ నేపథ్యంలోనే భద్రతాబలగాలు ఫైర్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్‌కౌంటర్ సంబందించిన మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున కశ్మీర్‌లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

చదవండి : Encounter: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం