Hyd Pubs : డ్రగ్స్ అమ్మే వారిని ఎన్‌‌కౌంటర్ చేయండి.. కేసీఆర్‌‌కు పూర్తి మద్దతు

డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని.. ఇందుకు సీఎం కేసీఆర్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు...ఈ విషయం పోలీసులకు తెలవదా..? సూటిగా ప్రశ్నించారాయన. వారికి ఏ మూలన ఏం...

Hyd Pubs : డ్రగ్స్ అమ్మే వారిని ఎన్‌‌కౌంటర్ చేయండి.. కేసీఆర్‌‌కు పూర్తి మద్దతు

Bjp (1)

Hyd Drugs : హైదరాబాద్ అంటే హైటెక్ నగరంగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత కంపెనీలు ఇక కొలువు దీరాయి. అయితే.. ఇలాంటి హైటెక్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణా, పలు పబ్స్ లలో డ్రగ్స్ ను యదేచ్చగా విక్రయిస్తున్నారు. ఇప్పటికే పలు పబ్స్ లపై దాడి చేసిన పోలీసులు వాటిని సీజ్ కూడా చేశారు. కానీ.. ఈ తంతు ఆగడం లేదు. తెల్లవారుజామున వరకు పబ్స్ లలో పార్టీలు జరుగుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. ఇందులో డ్రగ్స్ వినియోగించారనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు..వారి కొడుకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read More : Banjara Hills CI : బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్

దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని.. ఇందుకు సీఎం కేసీఆర్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..డ్రగ్స్ కేసు అంటూ పోలీసులు మళ్లీ రావడం మొదలుపెట్టారని, రెండు రోజులు హడావిడి చేసి మళ్లీ కేసును పక్కన పడేస్తారని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్స్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి ? ఈ విషయం పోలీసులకు తెలవదా..? సూటిగా ప్రశ్నించారాయన. వారికి ఏ మూలన ఏం జరుగుతుందో అన్నీ తెలుసని, కానీ కొద్ది రోజులు షో చేసి వదిలేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ యువకులు ఏమైనా సీఎం కేసీఆర్ కి అవసరం లేదని, నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి మూలాలను కనిపెట్టాల్సిందిగా సూచించారు. డ్రగ్స్ కొనుగోలు చేసే వారిని, అమ్మేవారిని ఎలాంటి శిక్ష అయినా వేయాలన్నారు. అవసరమనుకుంటే డ్రగ్స్ అమ్మే వారిని ఎన్ కౌంటర్ చేయాలని మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు .