Viral Video: వధువు వీడియో వైరల్.. డ్రైవింగ్ చేసుకుంటూ.. డ్యాన్స్ వేసుకుంటూ వేదిక దగ్గరకు..

పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఇటీవలికాలంలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం..

Viral Video: వధువు వీడియో వైరల్.. డ్రైవింగ్ చేసుకుంటూ.. డ్యాన్స్ వేసుకుంటూ వేదిక దగ్గరకు..

Wedding

Viral Video: పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఇటీవలికాలంలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం.. అందులోనూ వధువు చేసే పనులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. బుల్లెట్టు బండెక్కి వచ్చేయనా? అంటూ గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో గుర్తుండే ఉంటుంది. లేటెస్ట్‌గా పెళ్లికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వధువు పెళ్లికి తన స్వంత కారును నడుపుకుంటూ వేదిక వద్దకు వెళ్లింది. సోషల్‌ మీడియాలో కనిపించిన ఈ వీడియోలో ఓ పెళ్లికూతురు పెళ్లి దుస్తుల్లో సిద్ధమై స్వయంగా కారు నడుపుతుంది. ఆమె తన వివాహ వేదిక వైపు వెళ్తోంది. ఆమె కారులో షాహిద్ కపూర్ నటించిన ‘వివాహ్’ చిత్రంలోని ‘మిలన్ కీ జల్దీ హై’ పాట ప్లే అవుతోంది.

డ్రైవింగ్‌తో పాటు డ్యాన్స్ కూడా..
కారు డ్రైవింగ్‌తో పాటు, వధువు కూడా లోపల ప్లే చేస్తున్న పాటకు డ్యాన్స్ చేస్తూనే ఉంది. కారు డ్రైవింగ్‌ సమయంలోనే అద్భుతంగా డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ వైరల్ వీడియోలో వధువు తప్ప మరెవరూ కనిపించలేదు. మొత్తం ఫ్రేమ్‌లో అదే కనిపిస్తుంది.

ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చాలా బాగా ఇష్టపడుతున్నారు. ప్రజలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉండే ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.