Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నుండి ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే మాస్ మసాలా సాంగ్ అదిరిపోయింది..

Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

Eyy Bidda

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ చిన్నది రష్మిక మందన్న జంటగా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘పుష్ప’ – ది రైజ్.. ఈమైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లకు, మూడు పాటలకు రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. శుక్రవారం ఉదయం నాలుగో పాట రిలీజ్ చేశారు. ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సాగే సాలిడ్ మాస్ మసాలా సాంగ్ వినసొంపుగా ఉంది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్‌కి చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. నాకాష్ అజీజ్ చక్కగా పాడాడు. ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న భారీ రిలీజ్‌కి రెడీ అవుతోంది ‘పుష్ప’. థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ క్రేజీ రేటుకి సేల్ అయిపోతున్నాయి.