Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే

మిగిలిన హీరోలంతా వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తుంటే ప్రభాస్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. ప్రభాస్ తో సినిమా తీసే దర్శక నిర్మాతలు ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని

Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే

Prabhas

Radheshyam : ‘బాహుబలి’ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తూ బిజీ అయిపోయాడు ప్రభాస్. అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో, ఎక్కువ టైం పడుతుండటంతో సినిమాల నుంచి ఎలాంటి అప్ డేట్స్ ఉండటంలేదు. ఇప్పటికే ‘సాహో’ వచ్చి రెండేళ్లు దాటుతుంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా ఎటువంటి అప్ డేట్స్ లేవు. ప్రభాస్ అభిమానులు చాలా ఓపికగా ఎదురుచూసారు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి ఫోటోషూట్ పోస్టర్స్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇక మిగిలిన సినిమాల నుంచి అవికూడా లేవు. మిగిలిన హీరోలంతా వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తుంటే ప్రభాస్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. ప్రభాస్ తో సినిమా తీసే దర్శక నిర్మాతలు ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Dulquer Salmaan : కేబీఆర్ పార్క్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి

ఇది సూసైడ్ లేఖ. ఓ ప్రభాస్ అభిమాని ‘రాధేశ్యామ్’ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని సూసైడ్ లేఖ రాసి ట్విట్టర్లో పెట్టి ‘రాధేశ్యామ్’ నిర్మాతలు యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ ను ట్యాగ్ చేశారు. ఈ సూసైడ్ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ లేఖలో సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ సూసైడ్ లెటర్ ని రాశాడు.

Anasuya : దానికోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ : అనసూయ

అంతే కాక నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ రాసాడు. మరి ఈ లెటర్ సినిమా టీం వరకు వెళ్లిందో లేదో తెలీదు కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఈ లెటర్ ని షేర్ చేస్తున్నారు. మరి ఆ అబ్బాయి సీరియస్ గా సూసైడ్ లెటర్ రాశాడా? లేదా అప్ డేట్స్ రావట్లేదని క్యాజువల్ గా రాశాడో తెలీదు.