Ramesh Babu : బిజినెస్‌మెన్ స్పెషల్ షోలో రమేష్‌బాబుకు నివాళులు అర్పించిన అభిమానులు

నిన్న రాత్రి హైదరాబాద్‌ కొత్తపేట మహాలక్ష్మి థియేటర్ లో బిజినెస్‌మెన్ స్పెషల్ షో వేశారు. రమేష్ బాబు మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఈ స్పెషల్ షో సందర్భంగా రమేష్‌బాబుకు నివాళులు.....

Ramesh Babu : బిజినెస్‌మెన్ స్పెషల్ షోలో రమేష్‌బాబుకు నివాళులు అర్పించిన అభిమానులు

Ramesh Babu

Ramesh Babu :   సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిన్న రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

నిన్న రాత్రి హైదరాబాద్‌ కొత్తపేట మహాలక్ష్మి థియేటర్ లో బిజినెస్‌మెన్ స్పెషల్ షో వేశారు. రమేష్ బాబు మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఈ స్పెషల్ షో సందర్భంగా రమేష్‌బాబుకు నివాళులు అర్పించారు. రమేష్ బాబు లాంగ్ లైవ్, అమర్ రహే రమేష్ బాబు అంటూ నినాదాలు చేశారు. అక్కడికొచ్చిన అభిమానులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లతో సంతాపాన్ని తెలియచేశారు.