Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

బాలీవుడ్ ముస్తాబవుతోంది. చాలా కాలం నుంచి పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతున్న లవ్ బర్డ్స్ కి పెళ్లి చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇదంతా ఎప్పుడో కాదు.. ఈ సంవత్సరం లోనే. లాస్ట్ ఇయరే..

Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

Bollywood Lovers

Bollywood Lovers: బాలీవుడ్ ముస్తాబవుతోంది. చాలా కాలం నుంచి పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతున్న లవ్ బర్డ్స్ కి పెళ్లి చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇదంతా ఎప్పుడో కాదు.. ఈ సంవత్సరం లోనే. లాస్ట్ ఇయరే జరగాల్సిన రణబీర్ ఆలియా పెళ్లితో పాటు కత్రినా కైఫ్ కూడా ఈ డిసెంబర్ లో పెళ్లికి ముస్తాబవుతోంది. బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమ జంటలు పెళ్ళిచేసుకోబోతున్నాయి.

Naga Chaitanya-Samantha: చైతూ గుర్తులు చెరిపేస్తున్న సామ్.. ఫోటోలు డిలీట్!

ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్న ఆలియాభట్-రణబీర్, రూమర్డ్ లవర్స్ కత్రినాకైఫ్-విక్కీ కౌషల్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లో న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. దాదాపు మూడేళ్లకు పైగా ప్రేమలో మునిగితేలుతున్న రణబీర్ ఆలియా ఫైనల్లీ పెళ్లి పీటలెక్కబోతున్నారు. నిజానికి లాస్ట్ ఇయరే వీళ్లు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు కానీ.. కోవిడ్ తో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫైనల్లీ ఈ డిసెంబర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేసుకున్నారు ఈ జంట.

Sankranti 2022: మనసు మార్చుకుంటున్న సంక్రాంతి పందెం కోళ్లు!

ఈ క్రేజీ కపుల్ తో పాటు మరో జంట కూడా పెళ్లికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ రూమర్డ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారని, వీళ్ల పెళ్లి కూడా డిసెంబర్ లోనే ఫిక్స్ అయ్యిందని న్యూస్ నడుస్తోంది. ఇప్పటికే 3 నెలలక్రితం వీళ్లకి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

RRR: ఫైనల్ కాపీ రెడీ.. ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం ఎంతంటే?

అంతేకాదు.. మీడియా కంట పడకుండా జాగ్రత్తపడి విక్కీ-కత్రినా ఇంటికి వెళ్లడం, స్క్రీనింగ్ లో కలుసుకోవడం లాంటివి చెయ్యడంతో వీళ్లు లవ్ లోనే ఉన్నారని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఈ హాట్ కపుల్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కే ప్లాన్ చేస్తున్నట్టు టాక్.