Big Boss 5: ఒకవైపు ఫుల్‌ప్యాక్ ఎంటర్టైన్మెంట్.. మరోవైపు ఎలిమినేషన్ ఎమోషన్!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 ఐదో వారం కూడా పూర్తయింది. నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ఫుల్ లోడెడ్ గెస్ట్స్, మరెన్నో అలరించే కార్యక్రమాలను తీసుకురావడంతో ఈ వారం ఎలిమినేషన్..

Big Boss 5: ఒకవైపు ఫుల్‌ప్యాక్ ఎంటర్టైన్మెంట్.. మరోవైపు ఎలిమినేషన్ ఎమోషన్!

Big Boss 5

Big Boss 5: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 ఐదో వారం కూడా పూర్తయింది. నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ఫుల్ లోడెడ్ గెస్ట్స్, మరెన్నో అలరించే కార్యక్రమాలను తీసుకురావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారు. కానీ.. బిగ్ బాస్ మాత్రం మరో కంటెస్టెంట్ ను ఇంటి నుండి బయటకి తీసుకొచ్చాడు. ఆదివారం నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా నాగ్‌ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోగా కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా రెడీ అయి అలరించారు. ఇక ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఏడిపించగా.. బయట స్టేజ్ మీద ఫుల్ బిందాస్ ఎంటర్ టైన్మెంట్ దొరికింది.

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

బిగ్ బాస్ నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా నాగ్ ముందుగా కంటెస్టెంట్లతో 9 గేమ్స్‌ ఆడించి 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఇక మొదటి గేమ్ లో భాగంగా రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీలను టీమ్‌ Aగా చేసిన నాగ్.. ప్రియా, విశ్వ, సిరి, కాజల్, మానస్, జెస్సీ, శ్రీ రామ్ లను B టీమ్‌ గా ప్రకటించాడు. అలా రెండు జట్ల మధ్య గేమ్స్ ఆడిస్తూ గెలిచినా వాయఱి టీం సభ్యులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యుల వీడియోలను చూపించాడు. దీంతో ఇంట్లో వాతావరణం ఎమోషనల్ గా మారింది.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

అలా మెల్లగా ఒక్కొక్కరి వీడియోలను చూపిస్తూనే బయట స్టేజి మీద ఒక్కో సెలబ్రిటీలను తీసుకొస్తూ అలరించాడు. సింగర్ మంగ్లీ సింగింగ్, హెబ్బా పటేల్ డాన్స్, ఆది పంచ్ లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ యూనిట్ వరకూ ఫుల్ ఫ్యాకెడ్ ఎపిసోడ్ గా నిలిచింది. ఇన్ని హైలెట్స్ ఉన్నా చివరికి యధావిధిగా ఎలిమినేషన్ కూడా పెట్టేశాడు. చివరగా మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించిన తర్వాత షణ్ముఖ్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా… వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఒక్కొక్కరు హమీదాను హత్తుకొని ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు.