IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”

లక్నో సూపర్ జెయింట్స్ యంగ్‌స్టర్ ఆయుష్ బదోనీపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై విరుచుకుపడిన బదోని హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు.

IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”

Ayush Badoni

IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ యంగ్‌స్టర్ ఆయుష్ బదోనీపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై విరుచుకుపడిన బదోని హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. వరుస వికెట్లు పడిపోతున్న తరుణంలో క్రీజులో నిలదొక్కుకున్న యువ ఆటగాడిపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

అయితే దీనిపై లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ఒక్క ఇన్నింగ్స్ తోనే టాలెంట్ ను లెక్కించడం చాలా కష్టం. ఒక్క ఇన్నింగ్స్ అతణ్ని సూపర్ స్టార్ ను చేసేయలేదు అంటూ కామెంట్లు చేశారు. ఎల్ఎస్జీ రెండో మ్యాచ్ కు ముందు మాట్లాడాడు గంభీర్.

“ఒక్క ఇన్నింగ్స్ తో అతని గురించి మాట్లాడటం చాలా కష్టం. అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది. అందుకే డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోగలుగుతున్నాడు. అతని టాలెంట్ గుర్తించాం. ఢిల్లీ ప్లేయర్ ని చాలా కాలంగా చూస్తున్నాం. అతణ్ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడమే ముఖ్యమైన పని” వివరించాడు గంభీర్.

Read Also: ఇలా అయితే టెస్టు టీంలో నీ ప్లేస్ కష్టమే – గంభీర్

అండర్ 19 ప్లేయర్ అయిన బదోనీని ను.. లక్నో సూపర్ జెయంట్స్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.