2018 Movie : వరుస విజయాలతో గీతా ఆర్ట్స్ బ‌న్ని వాసు.. 2018 మూవీ కలెక్షన్ల సునామీ!

ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో గీతా ఆర్ట్స్ బ‌న్ని వాసు పలు సినిమాలను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. తాజాగా 2018 మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు.

2018 Movie : వరుస విజయాలతో గీతా ఆర్ట్స్ బ‌న్ని వాసు.. 2018 మూవీ కలెక్షన్ల సునామీ!

Geetha Arts Bunny Vas hit a another block buster with 2018 movie

2018 Movie – Bunny Vas : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు గీత ఆర్ట్స్ పతాకం పై చిన్న సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ అద్భుతమైన విజయాల్ని అందుకుంటున్నాడు. ఏ భాష సినిమా అయినా కథ బాగుంటే అది తెలుగు ఆడియన్స్ కి చూపించాలనే ఆలోచనతో.. పలు భాషల్లో అద్భుత విజయాల్ని అందుకున్న చిన్న సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంతార (Kantara) చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయగా ఎంతటి ఘ‌న‌విజ‌యాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు సెట్స్‌లో అగ్ని ప్రమాదం..

అలాగే ఇటీవల తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘విడుదల’ (Vidudala) మూవీని కూడా తెలుగులో రిలీజ్ చేయగా సూపర్ హిట్టుగా నిలిచి బన్నీ వాసుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళంలో రిలీజ్ అయిన ‘2018’ మూవీ అక్కడ ఇండస్ట్రీగా నిలువగా.. దానిని కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. కేవలం ఆ బాషల్లో హిట్ అయ్యిందని, ఇక్కడ కూడా డబ్బులు సంపాదించాలని కాకుండా.. ఆ చిత్రాల్లో ఉన్న గొప్ప కథని ఇక్కడ ప్రేక్షకులు కూడా అనుభూతి చెందాలనే ఆలోచనతోనే తెలుగులో కూడా బన్నీ వాసు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.

Adipurush : ఆదిపురుష్ నుంచి మరో సాంగ్.. రామ్ సీత రామ్!

ఇక 2018 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లో 4.48 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ డే నుంచి మూడో రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ రావడం గమనార్హం. ఈ మూవీ తెలుగు రైట్స్ ని బన్నీ వాసు చాలా తక్కువ ధరకే కొన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ చిత్రంతో కూడా బన్నీ వాసు మ‌రోక్కసారి జాక్‌పాట్ కొట్టాడ‌నే చెప్పాలి. ఎది ఎమైనా ఇలాంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నే బ‌న్నివాసు ఆలోచ‌నని అభినందించాలి.