Genelia : నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను.. కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జెనీలియా

ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీని చూసుకుంటూ, బిజినెస్ లు కూడా చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తుంది మన హాసిని. జెనీలియా పెద్ద కొడుకు రియాన్‌ ఏడో పుట్టినరోజు సందర్భంగా.........

Genelia : నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను.. కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జెనీలియా

Genelia

Genelia :  ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘ఢీ’, ‘ఆరెంజ్’.. లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి జెనీలియా. తర్వాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. సినిమాలకి దూరమైనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. తన ఫ్యామిలీ గురించి, తన ఫ్యామిలీ ఫొటోల్ని, వీడియోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీని చూసుకుంటూ, బిజినెస్ లు కూడా చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తుంది మన హాసిని.

Akhanda : ‘అఖండ’ వేదికపై ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్

తాజాగా జెనీలియా పెద్ద కొడుకు రియాన్‌ ఏడో పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో తన కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ”ప్రియమైన రియాన్‌! నీ చిట్టి బుర్రలోని బోలెడన్ని కోరికలు, ఆశలు కచ్చితంగా నెరవేరుస్తానని నీ పుట్టిన రోజున మాటిస్తున్నాను. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ పడను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను సరేనా? పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌. ఐ లవ్‌ యూ బ్రేవ్‌ బాయ్‌.” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. రియాన్ కి కామెంట్స్ లో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు.