Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?
శంకర్, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'జెంటిల్మెన్'. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?
![Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..? Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/07/Gentleman-2-is-directed-by-Gokul-Krishna-and-keeravani-music.jpg)
Gentleman 2 is directed by Gokul Krishna and keeravani music
Gentleman 2 : ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘జెంటిల్మెన్’. కె టి కుంజుమాన్ నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరో పాత్రలో నటించాడు. 1993 లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 175 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ని కూడా అందుకుంది. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. నిర్మాత కె టి కుంజుమాన్ ఈ సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించారు.
Salman Khan : చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. సల్మాన్ ఖాన్ ప్రెస్ నోట్.. అసలు ఏమైంది..!
గత కొంతకాలంగా ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు’ సీక్వెల్ ని (Indian 2) తెరకెక్కిస్తున్నాడా కదా. ఆ మూవీ తరువాత ఈ సీక్వెల్ కూడా శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెకెక్కిన ‘ఆహా కళ్యాణం’ సినిమాని డైరెక్ట్ చేసిన ఏ గోకుల్ కృష్ణ ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నాడట.
Academy award winning music director @mmkeeravaani to kick-start his composing for mega producer @KT_Kunjumon‘s #Gentleman2 soon. He is very much impressed with the script naration of director @agoks @film_gentleman#thottatharani @johnsoncinepro @ajay_64403@MovieBond1 pic.twitter.com/BKobu0aewi
— C K Ajaykumar,PRO (@ajay_64403) June 3, 2023
అలాగే సంగీత దర్శకుడు కూడా చేంజ్ అయ్యాడు. జెంటిల్మెన్ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇప్పుడు ఈ సీక్వెల్ కి కీరవాణి మ్యూజిక్ చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సిట్టింగ్స్ మొదలయ్యాయి అంటూ నిర్మాత తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. మరి క్లాసిక్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోకుల్ కృష్ణ ఎలా హ్యాండిల్ చేయగలడో చూడాలి.