Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు ఈ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి!

Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు +92, +84, +62 వంటి మరిన్ని అంతర్జాతీయ నంబర్ల నుంచి గుర్తుతెలియని కాల్‌లు వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త..

Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు ఈ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి!

Getting unknown calls from numbers starting with +92, +84, +62, more

Whatsapp Unknown Calls : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ వాట్సాప్‌కు +84, +62, +60 అంతర్జాతీయ నంబర్‌ల నుంచి గుర్తుతెలియన కాల్స్ వస్తున్నాయా? స్కామ్‌లో చిక్కుకోకుండా సురక్షితంగా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.. వివిధ దేశాల నుంచి గుర్తుతెలియని కాల్ స్కామ్‌లు ఇప్పటికీ వాట్సాప్‌లో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కొంతమందికి వాటిగురించి తెలియక స్పీకరిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే చాలా మంది వ్యక్తులు +84, +62, +60 మరిన్ని అంతర్జాతీయ నంబర్ల నుంచి తెలియని కాల్‌లను స్వీకరించడంపై ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వాట్సాప్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికీ అంతర్జాతీయ నంబర్ల నుంచి గుర్తుతెలియని కాల్‌లను మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి దేశాల నుంచి వాట్సాప్ యూజర్లు ISD కోడ్‌ల ద్వారా సూచించిన విధంగా గుర్తుతెలియని కాల్‌లను పొందుతున్నారు. ఈ కాల్స్ వెనుక కారణం ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉంది. ఈ కాల్స్ ఆర్థిక ప్రయోజనాల కోసం యూజర్లను మోసం చేసే ప్రయత్నాలు కావచ్చనే ఆందోళనలు ఉన్నాయి. చాలామంది వ్యక్తులు ప్రత్యామ్నాయ రోజులలో 2 లేదా 4 కాల్‌లను స్వీకరించినట్లు రిపోర్టు చేశారు.

Read Also : Poco Pods Wireless Earbuds : పోకో నుంచి ఫస్ట్ రియల్ Pods వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ప్రారంభ ధర రూ.1,199 మాత్రమే..!

ఇటీవల కొత్త సిమ్ కార్డు పొందిన వారికి అంతర్జాతీయ నంబర్ల నుంచి ఎక్కువ కాల్స్ రావడం గమనార్హం. ఇలాంటి కాల్‌లను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని వాట్సాప్ గతంలో యూజర్లకు సూచించింది. అనుమానాస్పద మెసేజ్‌లు/కాల్‌లను నిరోధించడం, రిపోర్టు చేయడం వంటి మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యూజర్లు గుర్తుతెలియని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నంబర్ల నుంచి కాల్‌లను స్వీకరించడానికి ఇదే ముఖ్యమైన దశగా వాట్సాప్ తెలిపింది.

Getting unknown calls from numbers starting with +92, +84, +62, more

Whatsapp Unknown Calls : Getting unknown calls from numbers starting 

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికతలో స్థిరంగా పెట్టుబడి పెట్టామన్నారు. IT నియమాలు 2021 ప్రకారం.. మా నెలవారీ యూజర్ సెక్యూరిటీ రిపోర్టు, యూజర్ ఫిర్యాదుల వివరాలను కలిగి ఉంటుంది. వాట్సాప్‌ మార్చి నెలలోనే 4.7 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించిందని కంపెనీ తెలిపింది.

వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్‌లు వస్తున్నాయా? వెంటనే ఇలా బ్లాక్ చేయండి :
వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. తెలియని వ్యక్తికి అన్‌నౌన్ కాల్‌లు లేదా అనుమానాస్పద మెసేజ్‌లు వస్తున్నట్లయితే.. ఎంటర్‌టైన్మెంట్ అందించవద్దని యూజర్లకు సూచిస్తోంది. గుర్తుతెలియని కాలర్‌లను లేదా స్కామర్ల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. More Options > Settings నొక్కండి.
* ఇప్పుడు, Privacy > Blocked Contacts ఆప్షన్‌పై మళ్లీ Tap చేయండి.
* కేవలం ‘Add ’ బటన్‌పై నొక్కండి.
* ఇప్పుడు, మీరు బ్లాక్ చేసే కాంటాక్ట్ కోసం సెర్చ్ చేయండి లేదా ఎంచుకోండి.

Read Also : Amazon Great Freedom Sale : వచ్చేవారమే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!