Ghani : గని ప్రీ రిలీజ్ బిజినెస్..

గని సినిమా ఈ రోజు (ఏప్రిల్ 8) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.............

Ghani : గని ప్రీ రిలీజ్ బిజినెస్..

Ghani

Ghani :  వరుణ్‌ తేజ్‌ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’. అల్లు బాబీ, సిద్దు కలిసి ఈ సినిమాని నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్నా ఐటెం సాంగ్ కూడా చేసింది. గని సినిమా ఈ రోజు (ఏప్రిల్ 8) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం : 8 కోట్లు

సీడెడ్ : 3.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్ : 9.50 కోట్లు

రెస్టాఫ్ భారత్ : 2.50 కోట్లు

ఓవర్సీస్ : 1.80 కోట్లు

గని సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 25.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్లకు పైగా రాబట్టాలి.

Varshini Sounderajan : వర్షిణి బర్త్‌డే సెలబ్రేషన్స్

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. అయితే థియేట్రికల్ బిజినెస్ లో పెట్టుబడి రాలేదు ఈ సినిమాకి. గని సినిమా ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా 20 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం. ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్ అన్ని కలిపితే గని సినిమా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆర్ఆర్ఆర్ ఇంకా థియేటర్లలోనే ఉండటం, వారం రోజుల్లో బీస్ట్, కెజిఎఫ్ 2 సినిమాలు రిలీజ్ కి ఉండటంతో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.