Virupaksha: ‘విరూపాక్ష’ను రిలీజ్ చేయండి ప్లీజ్ అంటోన్న నార్త్ ఆడియెన్స్..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’కు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో, ఈ సినిమాను ఇప్పుడు నార్త్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Virupaksha: ‘విరూపాక్ష’ను రిలీజ్ చేయండి ప్లీజ్ అంటోన్న నార్త్ ఆడియెన్స్..?

Golden Chance For Virupaksha To Release In Hindi Belt

Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ భారీ అంచనాల మధ్య నిన్న(ఏప్రిల్ 21) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, మిస్టిక్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్రర్ అంశాలు ఈ సినిమాపై జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్’బస్టర్ టాక్ రావడంతో, మున్ముందు ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Virupaksha : చిరు ఇంట విరూపాక్ష సక్సెస్.. కేక్ పై చిరు రాయించిన పేరు భలే ఉంది..

అయితే, ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయి కంటెంట్ ఉన్నా, కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూశాక, మిగతా భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లో ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ ఉందని చెప్పాలి. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో నార్త్ ఆడియెన్స్ ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో అక్కడ బడా సినిమాలు ఏవీ రిలీజ్‌కు రెడీగా లేవు. దీంతో విరూపాక్ష మూవీని ఇప్పుడు హిందీ బెల్ట్‌లో రిలీజ్ చేస్తే, ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడం ఖాయమని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Virupaksha : విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. గ్యాలరీ!

గతంలోనూ కార్తికేయ-2 వంటి కంటెంట్ ఉన్న సినిమాకు నార్త్ ఆడియెన్స్ పట్టం కట్టారు. ఇప్పుడు సాలిడ్ కథతో వచ్చిన విరూపాక్ష గనక నార్త్‌లో రిలీజ్ అయితే, ఈ సినిమాకు కూడా సేమ్ రిజల్ట్ దక్కుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ టాక్‌ను తెచ్చుకున్న విరూపాక్ష ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుందా లేదా అనేది చూడాలి.