iPhone Users Risk Warning : ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ ఫోన్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..!

iPhone Users Risk Warning : ఐఫోన్ 6s, ఐఫోన్ 7 సిరీస్, ఐఫోన్ 8 సిరీస్, ఐఫోన్ SE ఫస్ట్-జెన్‌లతో సహా పాత మోడల్‌లకు హై రిస్క్ ఉందని అధికారిక వెబ్‌సైట్‌లో (CERT) పేర్కొంది.

iPhone Users Risk Warning : ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ ఫోన్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..!

Govt issues high-risk warning for iPhone users in India, advices them to update phone immediately

iPhone Users Risk Warning: ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతీయ (iPhone) వినియోగదారులకు భద్రతపరమైన హెచ్చరికను జారీ చేసింది. ఐఫోన్ యూజర్లకు హైరిస్క్ ఉందని, హ్యాకర్లు మీ డివైజ్‌పై పూర్తి కంట్రోల్ పొందవచ్చునని నివేదిక వెల్లడించింది.

అధికారిక వెబ్‌సైట్‌లో iPhone 6s, iPhone 7 సిరీస్, iPhone 8 సిరీస్, iPhone SE ఫస్ట్-జెన్‌లతో సహా పాత మోడల్‌లు కూడా హాని కలిగిస్తాయని CERT-In పేర్కొంది. iPad Air, Pro ,Miniతో సహా iPad యూజర్లు కూడా iPadOS లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మీ ఐఫోన్ అప్‌డేట్ చేసేందుకు Settings > General > Sofware Update ఓపెన్ చేయండి. అదే పద్ధతి ఐప్యాడ్ (iPad) యూజర్లకు కూడా వర్తిస్తుంది.

Read Also : Apple Offer for Students : ఆపిల్ ప్రొడక్టులపై అదిరే ఆఫర్లు, ఫ్రీగా ఎయిర్‌ప్యాడ్స్, మ్యాక్, ఐప్యాడ్‌లపై భారీ డిస్కౌంట్లు..!

కెర్నల్‌లోని ఇన్‌పుట్ వెరిఫికేషన్ WebKit కారణంగా Apple iOS, iPadOSలో బగ్స్ ఉన్నాయని CERT-In పేర్కొంది. కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో WebKit ప్రధానమైనది. WebKit అనేది ప్రధాన టెక్నాలజీ. ఆపిల్ సఫారీ బ్రౌజర్‌లో బగ్స్ కారణంగా సిస్టమ్‌లో ఏకపక్ష కోడ్‌ను ఇంజెక్ట్ చేయగలదని భద్రతా ఏజెన్సీ నివేదించింది. హ్యాకర్లు తమ డివైజ్‌పై కంట్రోల్ కూడా పొందవచ్చు.

Govt issues high-risk warning for iPhone users in India, advices them to update phone immediately

iPhone Users Risk Warning : Govt issues high-risk warning for iPhone users in India, advices them to update phone immediately

ఆపిల్ ఐఫోన్‌లలో కొత్త iOS అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ iPhone 6s (అన్ని మోడల్‌లు), iPhone 7 (అన్ని మోడల్‌లు), iPhone SE (1వ జనరేషన్), iPad Air 2, iPad mini (4వ జనరేషన్) iPod, iOS 15.7.7, iPadOS 15.7.7 (7వ జనరేషన్) అప్‌డేట్ రిలీజ్ చేసింది.

iOS 16.5.1,iPadOS 16.5.1 అప్‌డేట్‌లు కూడా iPhone 8 తర్వాత iPad Pro (అన్ని మోడల్‌లు), iPad Air 3వ జనరేషన్, iPad 5వ జనరేషన్ ఆపై వెర్షన్, iPad మినీ 5వ జనరేషన్ ఆపై వెర్షన్ ఐఫోన్లలో బగ్ సమస్య ఉన్నట్టు తేలింది. భద్రతా సంస్థ (Kaspersky) చెందిన పరిశోధకులు ఈ భద్రతా సమస్యలను కనుగొన్నారని ఆపిల్ సపోర్టు పేజీ పేర్కొంది. iOS కెర్నల్ సమస్యపై సపోర్ట్ పేజీలో కూడా వెల్లడించింది. iOS 15.7 కన్నా ముందు రిలీజ్ చేసిన iOS వెర్షన్లలో ఈ సమస్య ఉందని నివేదిక తెలిపింది.

Read Also : Samsung Galaxy Z Flip 5 : వచ్చే జూలైలోనే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. గెలాక్సీ Z ఫ్లిప్ 5 ధర లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?